Breaking News

Hyderabad: విద్యార్థినితో ఆటో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన

Published on Wed, 04/19/2023 - 11:58

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థిని పట్ల ఓ ఆటో డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆటో డ్రైవర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. టీచర్స్‌కాలనీకి చెందిన ఓ విద్యార్థిని స్థానిక ఓ కార్పొరేట్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శివసాయినగర్‌ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ యాకయ్య ఆ విద్యార్థినితో పాటు మరో ముగ్గురిని రోజూ ఆటోలో స్కూల్‌కు తీసుకెళ్లి తీసుకువస్తాడు.

ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు స్కూల్‌ వదిలిన తర్వాత అందరినీ ఆటోలో ఎక్కించుకొని బయలుదేరాడు. మిగతా ముగ్గురిని వారి వారి ఇళ్ల వద్ద వదిలి ఆ విద్యార్తిని ఇంటికి తీసుకెళ్లకుండా వేరే చోటికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 1:20 గంటల వరకు ఇంటికి చేరుకునే కూతురు 1:30 గంటల వరకు రాకపోవడంతో తండ్రి ఆటో డ్రైవర్‌కు ఫోన్‌ చేశాడు.

ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన ఆటో డ్రైవర్‌ మిగతా పిల్లలను వదులుతున్నాను సార్‌.. మా ఇంటికి వెళ్లే క్రమంలో మీ పాపను వదిలి వెళ్తానని సమాధానం చెప్పి పది నిమిషాల్లో ఆమెను ఇంటి వద్ద వదిలి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లిన విద్యార్థిని ఆటో డ్రైవర్‌ తనను ఇంటికి తీసుకురాకుండా మరో చోటికి తీసుకెళ్లి నా పట్ల అసభ్యంగా వ్యవహరించాడని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తండ్రి ఆటో డ్రైవర్‌కు ఫోన్‌ చేసి ఇంటికి పిలిచాడు. జరిగిన విషయంపై నిలదీసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించాడు. 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)