Breaking News

హైదరాబాద్‌–అమరావతి కొత్త రైలు మార్గం

Published on Thu, 07/17/2025 - 03:19

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌–అమరావతి మధ్య కొత్త రైల్వేలైన్‌ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. భూసేకరణ ప్రక్రియ పూర్తికానుండటంతో టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై నిర్మించాల్సిన భారీ వంతెనకు విడిగా టెండర్లు పిలుస్తారు. డిసెంబర్‌లో కొత్త లైన్‌ నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు. నాలుగేళ్లలో ఇది పూర్తికానుందని సమాచారం.  

ఎక్కడి నుంచి ఎక్కడి వరకు.. 
హైదరాబాద్‌–అమరావతి మధ్య తొలుత పిడుగురాళ్ల మార్గంలో కొత్తలైన్‌ నిర్మించాలని ప్రతిపాదించినా, తర్వాత దాన్ని ఉపసంహరించుకుని కాజీపేట–విజయవాడ లైన్‌తో అనుసంధానించాలని నిర్ణయించారు.  
⇒  కాజీపేట–విజయవాడ లైన్‌లో మధిర సమీపంలోని ఎర్రుపాలెం స్టేషన్‌ నుంచి కొత్త లైన్‌ ప్రారంభమవుతుంది.  
⇒  ఎర్రుపాలెం–పెద్దాపురం–చెన్నారావుపాలెం–పరిటాల–అమరావతి–కొప్పురావూరు–నంబూరు వరకు ఈ లైన్‌ కొనసాగుతుంది.  

⇒  గుంటూరు–విజయవాడ లైన్‌లో ఉన్న నంబూరు స్టేషన్‌తో ఇది అనుసంధానమవుతుంది. ఈ నిడివి 56.53 కి.మీ.గా ఉంటుంది.  
⇒  ఇటు కాజీపేట–విజయవాడ లైన్, అటు గుంటూరు–విజయవాడ లైన్‌.. ఈ రెండింటిని అనుసంధానిస్తూ మధ్యలో ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ లైన్‌ నిర్మితమవుతుందన్నమాట. 

⇒  హైదరాబాద్‌ నుంచి అమరావతి వరకు వెళ్లాలంటే.. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో బయలు దేరే రైలు కాజీపేట మీదుగా ఖమ్మం, మధిర, ఎర్రుపాలెం వరకు ప్రస్తుతం ఉన్న లైనులో వెళ్లి అక్కడి నుంచి కొత్త మార్గంలోకి మళ్లి పెద్దాపురం, పరిటాల మీదుగా అమరావతి చేరుకుంటుంది. అక్కడి నుంచి ముందుకు సాగి ప్రస్తుతం ఉన్న గుంటూరు–విజయవాడ లైనుతో అనుసంధానమై విజయవాడ చేరుకుంటుంది. ఈ రెండు పాత లైన్లను అనుసంధానించటం వల్ల చాలా రైళ్లను ఎటునుంచైనా దారి మళ్లించొచ్చు.  
⇒  ప్రస్తుత మార్గాల్లో సామర్థ్యానికి మించి రైళ్లు నడుస్తున్నందున, ఈ కొత్త మార్గం అందుబాటులోకి వస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. ప్రయాణికుల రైళ్లకే కాకుండా సరుకు రవాణా రైళ్లకు కూడా ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.  

భారీ వంతెన ప్రత్యేకం.. 
ఈ మార్గంలో కృష్ణానదిపై భారీ వంతెనను నిర్మించనున్నారు. అమరావతి–పరిటాల సెక్షన్ల మధ్య వడ్డమాను–కొత్తపల్లి గ్రామాలను అనుసంధానిస్తూ కృష్ణానదిపై 3.3 కి.మీ. నిడివితో ఈ వంతెన నిర్మిస్తారు. 55 స్పాన్స్‌తో ఉండే ఈ వంతెన నిర్మాణానికి రూ.550 కోట్లు ఖర్చు కానుంది. విజయవాడలో కృష్ణానదిపై ఉన్న రైల్వే వంతెనకంటే ఇది చాలా పెద్దది కావటం విశేషం.  

భారీ వ్యయం.. 
ఈ లైన్‌ నిర్మాణానికి రూ.2300 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. పనులు జరిగేకొద్దీ ఈ మొత్తం మరింత పెరగనుంది. ఈ పనులను రెండు దశల్లో నిర్మిస్తారు.  

ఫేజ్‌–1: 
⇒ నంబూరు–కొప్పురవూరు (5.5 కి.మీ.) 
⇒ కొప్పురువూరు– అమరావతి (12.75 కి.మీ) 

ఫేజ్‌–2: 
⇒ ఎర్రుపాలెం–పెద్దాపురం (5.1 కి.మీ) 
⇒ పెద్దాపురం–చెన్నారావుపాలెం (4.7 కి.మీ.) 
⇒ చెన్నారావుపాలెం–పరిటాల (8.65కి.మీ) 
⇒ పరిటాల–అమరావతి (20.29 కి.మీ.) 

⇒ ఈ ప్రాజెక్టు కోసం 361 హెక్టార్ల భూమిని సేకరిస్తున్నారు. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ తుదిదశలో ఉంది.  
⇒ కృష్ణానదిపై భారీ వంతెనతోపాటు ఈ మార్గంలో 32 పెద్ద వంతెనలు, 92 చిన్న వంతెనలు, రెండు ఆర్‌ఓబీలు, 10 ఆర్‌యూబీలు ఉంటాయి. ఎక్కడా వాహనాలు రైలు పట్టాల మీదుగా దాటి పోవాల్సిన పని ఉండదు. దేశంలో రైల్వే లెవల్‌ క్రాసింగ్స్‌ లేకుండా ప్రత్యామ్నాయంగా వంతెనలు నిర్మిస్తున్నందున, కొత్తగా నిర్మించబోయే మార్గాల్లో లెవల్‌ క్రాసింగ్స్‌ లేకుండా చూడాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమరావతి కొత్త మార్గంలో ఎక్కడా లెవల్‌ క్రాసింగ్స్‌ ఉండకూడదన్న ఉద్దేశంతో ఇన్ని వంతెనలకు ప్రణాళికలు రూపొందించారు.  

⇒ అమరలింగేశ్వరస్వామి దేవాలయం, అమరావతి స్తూపం, ధ్యాన బుద్ధ విగ్రహం, ఉండవల్లి గుహలు.. తదితర ఆధ్యాత్మిక ప్రాంతాలకు రైలు అందుబాటులోకి వస్తుంది.  
⇒ మచిలీపట్నం పోర్టు, కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టులకు మరిన్ని రైళ్లు వచ్చేందుకు వీలు కలుగుతుంది. 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)