Breaking News

బంజారాహిల్స్‌ నుంచి శిల్పా లేఅవుట్‌కు ఎక్స్‌ప్రెస్‌ వే

Published on Tue, 12/23/2025 - 08:26

సాక్షి,  హైదరాబాద్‌: నగరంలో ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణకు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కార్యాచరణ చేపట్టింది. వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు బంజారాహిల్స్‌ నుంచి ఫిల్మ్‌నగర్‌ మీదుగా శిల్పా లేఅవుట్‌ వరకు అక్కడి నుంచి నేరుగా ఔటర్‌కు చేరుకొనే విధంగా కొత్త ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ నిర్మాణానికి నిర్ణయించింది. అలాగే బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 12 నుంచి గచి్చ»ౌలిలోని శిల్పా లేఅవుట్‌ వరకు ఆరు లైన్ల ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించనున్నారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు–డీపీఆర్‌)ను రూపొందించేందుకు కన్సల్టెన్సీ నియమాకానికి హెచ్‌ఎండీఏ తాజాగా టెండర్లను ఆహా్వనించింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఔటర్‌రింగ్‌రోడ్డు వరకు సులభంగా రాకపోకలు సాగించేందుకు హెచ్‌ఎండీఏ ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, విస్తరణకు శ్రీకారం చుట్టింది. 

ఇప్పటికే సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌ రూట్‌లో డైరీఫామ్‌ వరకు ఎలివేటెడ్‌ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. మరోవైపు సికింద్రాబాద్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు మరో 23 కి.మీ.ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి టెండర్లు కూడా ఖరారయ్యాయి. ఓ బడా నిర్మాణ సంస్థ ఈ టెండర్‌లను దక్కించుకుంది. త్వరలోనే పనులను  ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రతిపాదన మేరకు బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 12 నుంచి ఫిలింనగర్, జడ్జీస్‌ కాలనీ, దుర్గంచెరువు, టీ హబ్, శిల్పా లేఅవుట్‌ మీదుగా ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రతిపాదించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు గచ్చిబౌలి చౌరస్తా మీదుగా శిల్పా లేఅవుట్‌ సమీపం వరకు వచ్చే ప్లైఓవర్‌ వరకు ఈ సరికొత్త రహదారికి ప్రణాళికలు రూపొందించారు.

 ఔటర్‌ నుంచి వచ్చేవారు నేరుగా నగరంలోకి చేరుకొనేందుకు, బంజారాహిల్స్‌ నుంచి నేరుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు చేరుకొనేందుకు ఈ రహదారి దోహదం చేయనుంది.ఈ రహదారిలో దాదాపు 6 నుంచి 7 కి.మీ.వరకు ఆరు లైన్ల స్టీల్‌ బ్రిడ్జిని నిర్మాణం చేస్తారు. వివిధ ప్రాంతాల్లో అండర్‌పాస్‌లను నిరి్మంచనున్నారు. ఇప్పటికే ఈ రోడ్డు కోసం హెచ్‌ఎండీఏ అధికారులు సర్వే పూర్తి చేశారు. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నివేదికను తయారు చేసేందుకు తాజాగా కన్సల్టెన్సీ నియమాకానికి హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. వారం రోజుల్లోనే టెండర్లను ఖరారు చేసి కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. 

మరోవైపు షేక్‌పేట్‌ నాలా నుంచి సీబీఐటీ వరకు మరో రహదారి నిర్మాణానికి కూడా హెచ్‌ఎండీఏ ప్రణాళికలను రూపొందించింది. ష్‌క్‌పేట్‌ వైపు నుంచి వచ్చే వాహనదారులు ఈ మార్గంలో నేరుగా ఔటర్‌కు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. నగరంలోని అన్ని వైపుల నుంచి ఔటర్‌రింగ్‌రోడ్డుకు, అలాగే  ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి  అన్ని వైపు లా  రీజనల్‌ రింగ్‌రోడ్డు వరకు రాకపోకలను సులభతరం చేసేందుకు రహదారుల అభివృద్ధి, విస్తరణకు విస్తృతమైన  ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తెలిపారు.  

Videos

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు