Breaking News

ఏదీ ఊరికే రాదు : సైబర్‌ నేరాలపై సజ్జనార్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Published on Mon, 11/24/2025 - 16:41

హైదరాబాద్‌: #NothingIsFree ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ (VC Sajjanar) గురించి పరిచయం అవసరంలేదు. తాను  ఏ పదవిలో ఉన్నా ఆ పదవికే వన్నె తెచ్చేలా  మెలగడం ఆయన నైజం. పోలీస్‌ అధికారిగా నేరగాళ్ల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారు. ఆర్టీసీ ఎండీగా, ఆర్టీసీలో  వినూత్న విధానాలను అవంలంబించి, తానేంటో నిరూపించు కున్నారు. ఇక బెట్టింగ్‌యాప్స్‌కు వ్యతిరేకంగా ఆయన చేపట్టిన ప్రచారం ఉద్యమంలా సాగింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రచారం చేసే  వారి పాలిట సింహ స్వప్నమే అయ్యారు. తాజాగా  హైదరాబాద్‌ నగర కమిషనర్‌గా సైబర్‌ నేరాలపై దృష్టిపెట్టరు. డేటా సేప్టీ గురించి తనదైన రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన ఎక్స్‌ లో చేసిన వరుస పోస్ట్‌లు పలువుర్ని ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట వైరల్‌గా మారాయి.

డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్తగా ఉండటం ఒక ఆప్షన్ కాదు… మీ భద్రతకు తప్పనిసరి! మీ డేటా… మీ జీవితానికి సంబంధించిన అంశం. దాన్ని మీరు కాపాడుకోకపోతే మరెవ్వరూ కాపాడలేరు.

చదవండి: ముంబై-వారణాశి చిన్నారి ఆరోహి : సెలబ్రిటీలనుంచి నెటిజన్లు దాకా కళ్లు చెమర్చే కథ
 

 త‌స్క‌ర‌ణ‌కు గురైన డేటాను ఉప‌యోగించి సైబ‌ర్ నేర‌గాళ్లు.. మీకు ఫేక్ లింకులు పంపుతారు, ప్రలోభపెట్టే కాల్స్ చేస్తారు. ఖాతాలు హ్యాక్ చేస్తారు. బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతారు. డ‌బ్బులు గుల్ల చేస్తారు. డిజిట‌ల్ అరెస్ట్‌లు లంటూ వ్య‌క్తిగ‌తంగా వేధింపుల‌కు దిగుతారు. ఒక్క క్లిక్‌తోనే మీ మొబైల్‌ను టార్గెట్ చేస్తారు.

అనుమానాస్పదమైన సైట్లు, యాప్స్… ఎప్పుడూ క్లిక్ చేయొద్దు. ‘Free movies’, ‘Free downloads’, ‘Free games’ — ఇవన్నీ ప్రమాద సంకేతాలు. ఉచితం అనిపించే ఈ కంటెంట్‌.. మీకు తాత్కాలిక ఎంజాయ్‌ ఇచ్చినా… భవిష్యత్తులో జీవితాంతం నష్టాన్ని మిగిల్చే ప్రమాదం పొంచి ఉంది.

మీ డేటా- మీ భద్రత. నమ్మదగిన వెబ్‌సైట్లనే వినియోగించండి. అపరిచిత లింక్‌లు ఓపెన్ చేయొద్దు. మీ ఖాతాల‌కు బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోండి. అనుమానాస్పద యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయండి. అంటూ వరుస ట్వీట్లు చేశారు.  డేటా చోరికి గురైతే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే జాతీయ హెల్ప్ లైన్ నంబ‌ర్ 1930 కాల్ చేయండి. లేదా జాతీయ సైబ‌ర్ క్రైం పోర్ట‌ల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి అని  సజ్జనార్‌ ప్రజల్నికోరారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)