Breaking News

భార్య వేధింపులతో భర్త ఆత్మహత్య

Published on Mon, 07/06/2026 - 11:09

కరీంనగర్‌రూరల్‌: భార్య వేధింపులు భరించలేక ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. బంగారు ఆభరణాలు తీసుకరావాలని, తల్లిదండ్రులను కలువకూడదంటూ మానసికంగా హింసించడంతోనే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తండ్రి ఆరోపిస్తున్నాడు. కరీంనగర్‌రూరల్‌ పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తపల్లి(హవేలి)కి చెందిన కళ్యాణం రవి కుమారుడు రాకేశ్‌(27) హైదరాబాద్‌కు చెందిన సంజన అలియాస్‌ వర్షను 2024లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. 

తీగలగుట్టపల్లిలోని సరస్వతినగర్‌లో భార్యాభర్తలు నివాసముంటున్నారు. కొంతకాలంగా తల్లిదండ్రులను కలవకుండా రాకేశ్‌ను సంజనా మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. సెల్‌ఫోన్‌లో సైతం మాట్లాడకుండా వేధింపులకు గురిచేయడంతో భరించలేక రాకేశ్‌ శనివారం మధ్యాహ్నం 3.30గంటలకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

ఉరేసుకొని వ్యక్తి..
యైటింక్లయిన్‌కాలనీ:  పెద్దపల్లి జిల్లా గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన కాసర్ల వెంకటేశ్‌(38)అనే కాంట్రాక్‌ డ్రైవర్‌ ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఓసీపీ–5లో కాంట్రాక్ట్‌ వోల్వో డ్రైవర్‌గా వెంకటేశ్‌ పనిచేస్తున్నాడు.ఎడాది క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మద్యానికి బానిసై విధులకు పోవడంలేదు. భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. శనివారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత భార్య మరోగదిలో తన అత్తవద్ద పిల్లలలో కలిసి నిద్రించింది. ఆదివారం తెల్లవారుజామున వెంకటేశ్‌ తన గదిలో ఉరేసుకుని కనిపించాడు. పని చేయకుండా, మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకొన్నట్లు మృతుడి భార్య స్వరూప ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.  


జీవితంపై విరక్తితో వివాహిత..
మానకొండూర్‌: మండలంలోని కొండపలకల గ్రామానికి చెందిన దావల్ల భాగ్యలక్ష్మి (45) జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీఐ శ్రీలత తెలిపిన వివరాలు.. భాగ్యలక్ష్మి కొంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతోంది. చాలా ఆస్పత్రులు తిరిగినా ఆరోగ్యం కుదుట పడలేదు. గతంలో కూడా ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు కాపాడారు. ఆదివారం కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లగా భాగ్యలక్ష్మి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు కుమారులు, భర్త ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.  

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)