Breaking News

చెన్నూర్‌ ఎస్‌బీఐలో కుంభకోణం

Published on Fri, 08/22/2025 - 01:15

చెన్నూర్‌: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో కుంభకోణం జరిగింది. నగదుతోపాటు ఖాతా దారులు తనఖా పెట్టిన బంగారునగలు మాయం కావడం జిల్లాలో సంచలనం సృష్టించింది. క్యాషి యర్‌ పెద్దఎత్తున బంగారం, నగదు మాయం చేసిన ట్టు తెలుస్తోంది. బ్యాంకు మేనేజర్‌ మనోహర్‌రెడ్డి రెండురోజుల సెలవు తర్వాత మంగళవారం విధుల్లో చేరారు. 

బ్యాంకులోని డబ్బు, ఖాతాదారులు తనఖా పెట్టిన నగల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలి సింది. దీంతో బ్యాంకు అధికారులు ఆడిటింగ్‌ నిర్వ హించారు. సుమారు 330 మంది ఖాతాదారులు తనఖా పెట్టిన రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు విలువైన బంగారు ఆభరణాలు, రూ.80 లక్షల నగ దు లావాదేవీల్లో తేడా వచ్చినట్టు గుర్తించి పోలీసు లకు సమాచారం ఇచ్చారు. 

జైపూర్‌ మండలం షెట్‌పల్లి గ్రామానికి చెందిన క్యాషియర్‌ రెండ్రోజు లుగా బ్యాంకుకు రాకపోవడం, ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉండడంతోపాటు బంగారం మాయంలో కీలక పాత్ర ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు తెలిసింది. ఆడిటింగ్‌ శుక్రవారం పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్టు జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. బ్యాంక్‌ను రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా గురువారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)