Breaking News

జోరు వానలో ఎట్‌ హోమ్‌

Published on Fri, 08/16/2024 - 05:05

సాక్షి, హైదరాబాద్‌: దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ గురువారం సాయంత్రం రాజ్‌­భవన్‌ ప్రాంగణంలో ఎట్‌ హోమ్‌ కార్యక్రమాన్ని నిర్వ­హించారు. ముఖ్యమంత్రి రేవంత్‌­రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కె.కేశవరావు, చిన్నారెడ్డి, కామా­రెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, ఎంపీలు మల్లు రవి, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ ఎల్‌. రమణ, సీఎస్‌ శాంతి­కుమారి, డీజీపీ జితేందర్‌ తదితరులు ఈ కార్యక్ర­మా­నికి హాజరయ్యారు. 

కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే భారీ వర్షం మొదలైంది. అయితే వాటర్‌ప్రూఫ్‌ టెంట్లు వేసి ఉండటంతో జోరు వానలోనూ కార్యక్రమం యథావిధిగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి హాజరైన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, పద్మ పుర­స్కార గ్రహీతల వద్దకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లి పలకరించారు. చివర్లో గవర్నర్‌ అతిథుల టేబుల్స్‌ వద్దకు వెళ్లి అందరినీ పలకరించారు. కాగా, వర్షపు నీటి ప్రవాహం టేబు­ల్స్‌ కిందకి చేరడంతో చివర్లో కొంత అసౌ­క­ర్యం కలిగింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ నేత­లు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.

భిన్నత్వంలో ఏకత్వమే మన బలం
మాతృభూమికి స్వాతంత్య్రం కోసం పోరాడిన అసంఖ్యాక దేశభక్తుల నిస్వార్థ త్యాగాలు చరిత్రలో చిరస్మర­ణీయంగా నిలిచాయని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌ ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లా­డారు. 

గడిచిన ఏడు దశాబ్దాల్లో దేశం అద్భుత ప్రగతిని సాధించింద­న్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన అ­తిపెద్ద బలమని స్పష్టం చేశారు. దేశం, రాష్ట్ర అభివృద్ధికి అకుంఠిత దీక్షతో పనిచే­యాలని ప్రజలకు పిలుపుని­చ్చారు. రాజ్‌­భవన్‌ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)