మెట్రోరైల్‌ 'మంత్లీ పాస్‌'

Published on Wed, 08/05/2026 - 02:33

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ తరహాలో మెట్రో రైళ్లలోనూ నెలవారీ, మూడు నెలల పాస్‌లను ప్రవేశపెట్టేందుకు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ సిద్ధమవుతోంది. ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడానికి సదుపాయాలను మరింత మెరుగుపరుచుకోవాలని.. ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టాలని ఇటీవల జరిగిన సంస్థ పాలకమండలి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఆదేశించారు. విద్యార్ధులు, ఉద్యోగుల ప్రయోజనాలకు అనుగుణంగా పాస్‌లను ప్రవేశపెట్టాలని సూచించారు. దీంతో ఆర్టీసీ అధికారులతో త్వరలో సంప్రదింపులు జరపనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఆర్టీసీలో ఉన్న వివిధ పాస్‌లు, వాటి ధరలు, ప్రయాణికుల ఆదరణ వంటి అంశాలను పరిశీలించి మెట్రో రైళ్లలో పాస్‌లను ప్రవేశపెట్టేందుకు విధివిధానాలను సిద్ధం చేయనున్నారు. ఇప్పటివరకు కొన్ని రకాల రాయితీ టికెట్లను ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల నుంచి వాటికి ఆదరణ కూడా లభించింది. కానీ అప్పట్లో వరుస నష్టాలను దృష్టిలో ఉంచుకొని రాయితీలను విరమించారు. ప్రస్తుతం ప్రభుత్వం హెచ్‌ఎంఆర్‌ఎల్‌ నిర్వహణలోకి రావడంతో ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా పాస్‌లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. 

ప్రయాణికులు పెరిగేలా... 
ప్రస్తుతం రోజుకు 4.70 లక్షల నుంచి 4.80 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా ప్రయాణికుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. పండుగలు, వరుస సెలవులు, వారాంతాల్లో మాత్రం రద్దీ అనూహ్యంగా నమోదవుతోంది. ఈ క్రమంలో పాస్‌లను ప్రవేశపెట్టడం వల్ల ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడంతోపాటు ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా అవకాశం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రయాణికుల డిమాండ్‌ మేరకు అదనపు కోచ్‌లను ప్రవేశపెట్టేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. 

ఆర్టీసీలో ఇలా... 
ఆర్టీసీలో 7 రకాల పాస్‌లు జారీ అవుతున్నాయి. అన్ని రకాల పాస్‌లు కలిపి 2 లక్షలకుపైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 24 గంటల ప్రయాణానికి వినియోగించే ట్రావెల్‌ యాజ్‌ యూ లైక్‌ (టీఏవైఎల్‌) టికెట్లను రోజుకు 80 వేలకుపైగా విక్రయిస్తున్నారు. అలాగే సాధారణ నెలవారీ పాస్‌లు 75 వేలకుపైగా ఉన్నాయి. ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్‌ బస్సుల కోసం వివిధ ధరల్లో వాటిని విక్రయిస్తున్నారు. అలాగే రాయితీలపై సుమారు లక్ష మంది విద్యార్ధులు పాస్‌లను వినియోగిస్తున్నారు. ఆర్టీసీ తరహాలోనే మెట్రో రైళ్లలోనూ పాస్‌లను ప్రవేశపెడితే లక్షన్నర మందికిపైగా ప్రయాణికులు వాటిని వినియోగించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.   

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)