Breaking News

పూర్తి ఫీజు చెల్లిస్తేనే ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ

Published on Thu, 03/06/2025 - 18:50

సాక్షి, హైద‌రాబాద్‌: లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కోసం దరఖాస్తు చేసుకున్నవారు పూర్తి ఫీజు చెల్లిస్తేనే  25 శాతం రాయితీ లభిస్తుందని హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అన్నారు. ఈ నెల 31వ తేదీలోపు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుతో పాటు ప్రో–రాటా ఓపెన్‌ స్పేస్‌ చార్జీలను కూడా చెల్లించిన వారికి రాయితీ వర్తిస్తుందన్నారు. బుధవారం హెచ్‌ఎండీఏ (HMDA) ఆధ్వర్యంలో బీఆర్‌కే భవన్‌లో  లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్స్‌ (ఎల్‌టీపీ), ఆర్కిటెక్ట్‌లకు ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌ (Workshop) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. నిషేధిత జాబితాలో లేని, బఫర్, ఎఫ్‌టీఎల్, చెరువులు, కుంటలు తదితర ప్రాంతాల్లో లేని ప్లాట్‌లకు ఆటోమేటిక్‌గా ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతి లభిస్తుందని చెప్పారు. చెరువులు, నీటి వనరులు తదితర ప్రాంతాలకు 200 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలకు మాత్రం రెవెన్యూ, నీటిపారుదల శాఖ అనుమతులు తప్పనిసరి అని చెప్పారు. 

ఎల్‌ఆర్‌ఎస్‌ అర్హతలేని స్థలాలపై చెల్లించిన ఫీజులో 90 శాతం రీఫండ్‌ (Refund) అవుతుందన్నారు. 10 శాతం మాత్రం ప్రాసెసింగ్‌ కోసం తీసుకుంటామని చెప్పారు. స్థలాల క్రమబద్ధీకరణను పారదర్శకంగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. సకాలంలో ఫీజులు చెల్లించిన వారికి త్వ‌ర‌లోనే ఎల్‌ఆర్‌ఎస్‌ (LRS 2020) జారీ ప్రక్రియను పూర్తి చేసి ప్రొసీడింగ్స్‌ ఇవ్వనున్నట్లు కమిషనర్‌ వివరించారు.

చ‌ద‌వండి: ఎల్‌ఆర్‌ఎస్‌కు ఐదంచెల ‘చెక్‌లిస్ట్‌’

ఎల్‌ఆర్‌ఎస్‌పై ఎలాంటి సందేహాలు ఉన్నా హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ 18005998838 నెంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాల్‌ సెంటర్‌ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ డైరెక్టర్‌లు విద్యాధర్, రాజేంద్రప్రసాద్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)