మాగనూర్‌ ఫుడ్‌ పాయిజన్‌ ఘటన..హెచ్‌ఎం సహా మరొకరిపై సస్పెన్షన్‌

Published on Thu, 11/21/2024 - 10:37

సాక్షి, నారాయణపేట: మాగనూర్ మండల కేంద్రంలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తనిఖీ చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మురళీధర్‌రెడ్డి, ఇన్‌ఛార్జ్‌ హెచ్‌ఎం బాపురెడ్డిని సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

అంతకుముందు.. మాగనూర్‌లో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై సీఎం రేవంత్‌ ఆరా తీశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్‌ ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సీఎం తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ తేల్చి చెప్పారు. 

 


 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)