Breaking News

‘ఎస్‌ఎల్‌బీసీ’పై రేపు సీఎం సమీక్ష

Published on Sun, 03/23/2025 - 04:52

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు నెల రోజులుగా జరుగుతున్న సహాయక చర్యలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో వ్యూహం మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం శాసనసభ కమిటీ హాల్‌లో సహాయక చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న 12 ఏజెన్సీల ఉన్నతాధికారులను ప్రభుత్వం ఈ సమావేశానికి పిలిచింది. 

బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) మాజీ డీజీ/ఆర్మీ మాజీ ఈఎన్‌సీ జనరల్‌ హర్పాల్‌ సింగ్, సొరంగాలకు సంబంధించి ప్రముఖ అంతర్జాతీయ నిపుణుడు క్రిస్‌ కూపర్, బీఆర్‌ఓ అదనపు డీజీ కేపీ పురుషోత్తం, మరో సొరంగాల నిపుణుడు కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రాలను సైతం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ భేటీకి రప్పిస్తోంది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటి? ఎంత పురోగతి సాధించారు? ఇంకా తీసుకోవాల్సిన చర్యలేమిటి? 

గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు ఇంకేం చేయాలి? అనే అంశాలపై ఆయా శాఖలు/సంస్థల అధికారులు ఈ సమీక్షలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. అవసరమైతే సహాయక చర్యలను సోమవారం ఒక రోజు నిలుపుదల చేసి ఈ కీలక సమావేశానికి హాజరు కావాలని వారిని ప్రభుత్వం కోరింది. గత నెల రోజులుగా 650 మంది సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేయగా గల్లంతైన 8 మంది కార్మికుల్లో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు.

సొరంగం కుప్పకూలిన ఫాల్ట్‌ జోన్‌లోని మట్టి, బండ రాళ్ల శిథిలాల కింద మిగిలిన ఏడుగురు నలిగిపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతుండగా ఆ ప్రాంతంలో తవ్వకాలు నిర్వహిస్తే మళ్లీ సొరంగం కూలిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆచితూచి తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొననున్నారు.  

సహాయక చర్యలకు రూ.5 కోట్లు విడుదల 
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న సహా యక చర్యలకు రూ. 5 కోట్లను మంజూరు చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశా రు. మరోవైపు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జీరో పాయింట్‌ వద్ద 40 మీటర్ల పరిధిలో సహాయక చర్యలు చేపట్టడం ప్రమాదకరమని అధికారులు తేల్చారు. 

ఆ ప్రాంతంలో సిమెంట్‌ సెగ్మెంట్స్‌ కుంగినట్లు నిర్ధారణ కు వచ్చి ‘డీ1’వద్ద ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇక అక్కడ సహాయక చర్యలు కష్టమేన ని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆచూకీ లభించని ఏడుగురి గుర్తింపుపై నీలినీడలు కమ్ముకున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)