Breaking News

అగ్ని ప్రమాదంపై ఉన్నతాధికారుల కమిటీ

Published on Wed, 05/21/2025 - 04:06

సాక్షి, హైదరాబాద్‌: గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమా దం ఘటనపై సమగ్ర విచారణ కోసం ఆరుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. ఈ నెల 18న ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి 17 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనపై విచారణకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్, ఫైర్‌ విభాగం డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ , టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌లతో కూడిన కమిటీని నియమించినట్లు మంత్రి తెలిపారు. 

ఘటనకు గల కారణాలు, ఘటన అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై సీఎంకు కమిటీ సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయి లో ప్రజలకు ఇవ్వాల్సిన సూచనలతో ప్రతిపాదనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం దాని ఆధారంగా సీఎం, డిప్యూటీ సీఎం, ఉన్నతాధికారులు సమీక్ష చేసి చర్యలు చేపడతారని తెలిపారు. 

ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం పరిశీలన 
చార్మినార్‌: అగ్ని ప్రమాదం సంభవించిన భవనాన్ని మంగళవారం క్లూస్, ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం పరిశీలించింది. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత తొలిసారిగా భవనంలో ప్రవేశించిన అధికారుల బృందం.. భారీ స్థాయిలో అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలతో పాటు భవనంలోని ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసింది. భవనంలో దాదాపు 14 ఏసీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గాలి, వెలుతురు సక్రమంగా లేకుండా ఏసీలు పనిచేస్తుండడంతో అవి అధిక ఒత్తిడికి గురైనట్లు భావిస్తున్నారు. అధిక ఒత్తిడి కారణంగా ఏసీ కంప్రెషర్‌ ఏదైనా పేలిపోయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.  

ఫ్లోరింగ్‌ ధ్వంసం.. గోడలన్నీ బీటలు 
బయటకు వెళ్లేందుకు సొరంగం లాంటి ఇరుకు మెట్ల దారి ఉండడం వల్లే బాధితులు ప్రమాదం నుంచి బయట పడలేకపోయారని అధికారులు నిర్ధారించారు. తీవ్రమైన మంటలకు గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు రెండంతస్తులు పూర్తిగా కాలిపోయాయి. గదుల గోడలన్నీ బీటలు వారాయి. షాబాద్‌ ఫ్లోరింగ్‌ పూర్తిగా ధ్వంసం అయింది. భవనం మొత్తం పనికిరాని విధంగా తయారయ్యింది. 

రాబోయే రోజుల్లో నివాసానికి పనికి రాదని ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలు 125 ఏళ్లకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నట్లు విచారణలో తేలింది. కాగా భవనం వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. మృతులకు సంబంధించిన వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)