Breaking News

అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌లకు మస్తు డిమాండ్‌

Published on Mon, 10/20/2025 - 08:23

సాక్షి,హైదరాబాద్‌: హైదరాబాదీలు విదేశీ రహదారులపై రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. ఉద్యోగ, వ్యాపార, పర్యాటక అవసరాల కోసం వివిధ దేశాలకు వెళ్లేవారు పాస్‌పోర్టులు, వీసాలతో పాటు అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్లను కూడా ఒక తప్పనిసరి అవసరంగా  భావించడం విశేషం. రవాణాశాఖ అందజేసే ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ పర్మిట్ (ఐడీపీ)కి ఏడాది పాటు చెల్లుబాటు ఉంటుంది. ఈ ఐడీపిపైన అక్కడ వాహనాలను నడిపేందుకు అవకాశం ఉంటుంది. ఆ తరువాత  ఆ దేశ నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకోవాలి. సాధారణంగా యూఎస్‌కు వెళ్లేవారి నుంచి ఐడీపీలకు  డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది.

 కానీ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తరువాత డాలర్‌ కలలు కరిగిపోవడంతో విద్యార్థులు  ఎక్కువగా యూరోప్‌ బాట పడుతున్నారు. దీంతో ఇప్పుడు యూఎస్‌కు వెళ్లే వాళ్లు మాత్రమే కాకుండా బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, తదితర దేశాలకు వెళ్లే వాళ్లు కూడా ఇంటర్నేషనల్‌ పరి్మట్‌ల కోసం బారులు తీరుతున్నారు. ఏటా సగటున 10 వేల నుంచి 12 వేల అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌లను అందజేస్తున్నట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 13,151 పరి్మట్‌లను అందజేశారు. 

ఈజీగా డ్రైవింగ్‌.. 
లక్షలకొద్దీ వాహనాలు, కిక్కిరిసిన రోడ్లు, ట్రాఫిక్‌ రద్దీ నడుమ హైదరాబాద్‌లో బండి నడిపిన వాడు ప్రపంచంలో ఎక్కడైనా ఈజీగా దూసుకుపోగలుగుతాడనేది జగమెరిగిన సత్యం. అందుకే హైదరాబాద్‌ నుంచి విదేశాలకు వెళ్లే వాళ్లు అక్కడి రోడ్లపైన తమ డ్రైవింగ్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్లకు సొంత డ్రైవింగ్‌ తప్పదు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్‌ పరి్మట్లకు డిమాండ్‌ పెరిగింది. విద్యార్ధులు, ఉద్యోగులతో పాటు మహిళలు సైతం ఐడీపీల కోసం పెద్ద సంఖ్యలో పోటీపడుతున్నారు. ప్రతి ఒక్కరికి వాహనం తప్పనిసరిగా మారడంతో డ్రైవింగ్‌ కూడా అనివార్యమైంది. మరోవైపు  మన ఐడీపీలు ఉన్న వాళ్లకు ఆయా దేశాల్లో డ్రైవింగ్‌ లైసెన్సులు  లభించడం కూడా తేలిక. పెద్దగా కఠినమైన  డ్రైవింగ్‌ పరీక్షలు లేకుండానే లైసెన్సులు అందజేస్తారు. 

ఐడీపీలు పొందడం ఇలా.... 
పాస్‌పోర్టు కలిగిన  వారు  అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్ లను తీసుకోవచ్చు.ఇందుకోసం  రవాణాశాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ‘సారథి’ వెబ్‌సైట్‌లో స్లాట్‌ నమోదు చేసుకోవాలి. అలాగే రూ.1500 ఫీజు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. అనంతరం  పాస్‌పోర్టు,ఆధార్‌. డ్రైవింగ్‌ లైసెన్సు, తదితర డాక్యుమెంట్‌లతో సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయంలోని అధికారులను సంప్రదిస్తే అప్పటికప్పుడు  ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌పరి్మట్‌లను అందజేస్తారు. ఇది తీసుకున్న రోజు నుంచి ఏడాది పాటు  చెల్లుబాటులో ఉంటుంది.ఆ తరువాత  దీన్ని పొడిగించుకొనేందుకు అవకాశం లేదు. మరోసారి స్వయంగా అధికారులను  సంప్రదించవలసి ఉంటుంది. ఒకవేళ ఆ దేశాల్లోనే స్థిరపడేవారైతే  ఏడాదిలోపు  అక్కడి నిబంధనల  మేరకు లైసెన్సు తీసుకోవలసి ఉంటుంది.నగరంలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, బండ్లగూడ, మణికొండ, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, మెహదీపట్నం, తదితర ప్రాంతీయ రవాణాకార్యాలయాల నుంచి సగటున 120 నుంచి 150 పర్మిట్ ను  అందజేస్తున్నట్లు అంచనా.

కొన్ని దేశాల్లో మన ఐడీపీ చెల్లుబాటు కాదు
మన అంతర్జాతీయ డ్రైవింగ్‌ పరి్మట్లకు సుమారు 150 దేశాల్లో  ఆమోదం ఉంది.కానీ కొన్ని దేశాల్లో మాత్రం చెల్లుబాటు కాదు.జపాన్, చైనా, సౌత్‌ కొరియా వంటి దేశాల్లో భారతీయ ఐడీపీలను  పరిగణనలోకి తీసుకోవడం లేదని, అక్కడ రవాణాశాఖ నిబంధనల మేరకు  డ్రైవింగ్‌ లైసెన్సులను తీసుకోవలసి ఉంటుందని  అధికారులు  తెలిపారు. యూఎస్,బ్రిటన్,న్యూజిలాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, సింగపూర్, దుబాయ్, తదితర దేశాల్లో ఏడాది పాటు చెల్లుబాటులో ఉంటే కొన్ని దేశాల్లో మాత్రం 6 నుంచి 9 నెలల వరకు అనుమతినిస్తారు.డ్రైవింగ్‌ నిబంధనల్లో మార్పు దృష్ట్యానే  ఈ అనుమతుల్లో  తేడాలు ఉన్నట్లు  రహదారిభద్రతా నిపుణులు  పేర్కొంటున్నారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)