Breaking News

విటుడిపై ‘ట్రాఫికింగ్‌’ చెల్లదు

Published on Fri, 06/12/2026 - 03:38

సాక్షి, హైదరాబాద్‌: సెక్స్‌ వర్కర్‌ సేవలు పొందిన వ్యక్తిని కేవలం విటుడు అన్న కారణంతో ఐపీసీ సెక్షన్‌ 370 (ట్రాఫికింగ్‌/మానవ అక్రమ రవాణా) కింద నేరస్తుడిగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఐపీసీ సెక్షన్‌ 370ఏ(2) కింద అతనిపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. సదరు సెక్స్‌ వర్కర్‌.. అక్రమ రవాణాకు గురైన మహిళ అనే విషయం అతనికి తెలిసినా లేదా తెలిసేందుకు అవకాశమున్నా సెక్షన్‌ 370(ఏ)(2) వర్తిస్తుందని చెప్పింది. 

అలాగే ఇతరులకు సెక్స్‌ వర్కర్లను సమకూర్చడం లేదా మధ్యవర్తిత్వం వహించడం వంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులపై పరిస్థితులకు అనుగుణంగా ట్రాఫికింగ్‌ కేసులు నమోదు చేయవచ్చని తెలిపింది. ఈ మేరకు దాఖలైన దాదాపు 120కి పైగా క్రిమినల్‌ పిటిషన్లలో ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పు వెలువరించింది. తాము ట్రాఫికింగ్‌కు పాల్పడకున్నా ఆ చట్టం కింద కేసులు పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ హేమంత్‌కుమార్‌ సహా 120 మంది పలు పిటిషన్లు దాఖలు చేశారు. వీరిలో చదువుకుంటున్న యువకులు, వ్యాపారవేత్తలు, ప్రైవేట్‌ సంస్థల ఉద్యోగులు ఉన్నారు. 

హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్‌ స్టేషన్లలో వేర్వేరుగా నమోదైన వ్యభిచారం కేసుల్లో వీరంతా నిందితులు. మూడేళ్లుగా నమోదైన ఇలాంటి కేసుల్లో హైకోర్టులోని సింగిల్‌ జడ్జిల ధర్మాసనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ప్రధాన న్యాయమూర్తి ఈ కేసుల విచారణను డివిజన్‌ బెంచ్‌కు అప్పగించారు. దీంతో జస్టిస్‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌ బీఆర్‌ మధుసూదన్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు కేవలం విటులం మాత్రమేనని, ట్రాఫికింగ్‌కు లేదా లైంగిక దోపిడీకి పాల్పడలేదని తెలిపారు.  

ట్రాఫికింగ్‌కు పాల్పడేవారి కోసమే ‘370’ 
వాదనలు విన్న ధర్మాసనం.. ఐపీసీ సెక్షన్‌ 370 ట్రాఫికింగ్‌కు పాల్పడే వ్యక్తులను శిక్షించేందుకు ఉద్దేశించిందని స్పష్టం చేసింది. స్వచ్ఛందంగా వృత్తిలో ఉండే సెక్స్‌ వర్కర్లు, వారి విటులను పోలీసులు, దర్యాప్తు సంస్థలు వేధించరాదని హెచ్చరించింది. స్వచ్ఛంద సెక్స్‌ వర్క్‌ భారత చట్టాల ప్రకారం నేరం కాదంటూ ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా ప్రస్తావించింది. 

అలాగే వేశ్యాగృహం లేదా వ్యభిచారం జరుగుతున్న ప్రాంగణ సమీపంలో ఉన్న వ్యక్తిపై సెక్షన్‌ 370ఏ(2) కింద కేసు నమోదు చేయలేమని పేర్కొంది. కేసు నమోదు చేయాలంటే..ట్రాఫికింగ్‌కు గురైన మహిళపై లైంగిక దాడికి పాల్పడేందుకు యత్నించాడని, ఆమె ట్రాఫికింగ్‌ బాధితురాలని అతనికి తెలుసు అనేందుకుఆధారాలు ఉండాలని వెల్లడించింది. కేవలం అక్కడ ఉండటం నేరంగా పరిగణించలేమనితేల్చిచెప్పింది.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)