Breaking News

పోలీసులు అతిగా జోక్యం చేసుకోవద్దు

Published on Thu, 12/12/2024 - 04:10

సాక్షి, హైదరాబాద్‌:  ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబ వివాదాల్లో అతిగా జోక్యం వద్దని పోలీసులకు హైకోర్టు సూచించింది. మొదట సమస్యను పరిష్కరించుకునే అవకాశం వారికి ఇవ్వాలని... అది సాధ్యం కాకుంటే చట్టప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది.

మోహన్‌బాబు ఇంటి వద్ద పోలీస్‌ పికెట్‌ సాధ్యం కాకుంటే.. ప్రతి రెండు గంటలకోసారి భద్రత పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని స్పష్టం చేసింది. అలాగే మోహన్‌బాబు, విష్ణులకు రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులను నిలిపివేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. 

మోహన్‌బాబు పిటిషన్‌తో..: తనపై దాడి చేశారంటూ మోహన్‌బాబు కుమారుడు, నటుడు మంచు మనోజ్‌ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పహాడీ షరీఫ్‌ పోలీసులు.. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌లకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులను సవాల్‌ చేస్తూ మోహన్‌బాబు బుధవారం హైకోర్టులో లంచ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆస్పత్రిలో ఉన్నానని.. ఈ పరిస్థితుల్లో పోలీసుల విచారణకు హాజరుకాలేనని కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున హోంశాఖ జీపీ మహేశ్‌రాజే వాదనలు వినిపిస్తూ.. పరస్పర ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసులు నమోదయ్యాయని వివరించారు. అలాగే జర్నలిస్టుపై దాడి చేసినందుకు మోహన్‌బాబుపై మరో క్రిమినల్‌ కేసు నమోదైందని తెలిపారు. 

ఇక మనోజ్‌ బౌన్సర్లను తీసుకొచ్చి మోహన్‌బాబు ఇంట్లో తగాదా సృష్టిస్తున్నారని మోహన్‌బాబు తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. బీఎన్‌ఎస్‌ఎస్, సెక్షన్‌ 126 ప్రకారం రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ జారీ చేసిన నోటీసులను కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రాచకొండ పోలీసుల ఎదుట మోహన్‌బాబు, విష్ణు హాజరుకావాలన్న నోటీసులను నిలిపివేశారు. 

శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా మోహన్‌బాబు ఇంటి చుట్టూ నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించారు. ఇక కుటుంబ వివాదంలో మీడియా ఎందుకింత హంగామా సృష్టిస్తోందని న్యాయమూర్తి ప్రశ్నించారు. సోషల్‌ మీడియాలో తప్పుడు కథనాలతో పరువుకు నష్టం కలిగించొద్దని సూచించారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)