Breaking News

ఎస్సీ కమిషన్‌కు ఆ అధికారం లేదు: హైకోర్టు

Published on Sun, 02/05/2023 - 10:38

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల సర్వీస్‌ అంశాలపై విచారణ జరిపే అధికారం ఎస్సీ కమిషన్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యుత్‌ శాఖ ఉద్యోగుల సీనియారిటీకి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లో ఉద్యోగుల సీనియారిటీని మెరిట్‌ ప్రాతిపదికన రూపొందించాలని 2001లో సర్కార్‌ జీవోలు జారీ చేసింది. అయితే ఈ జీవోలను నిలిపివేయాలని విద్యుత్‌ సంస్థల్లోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం  జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించింది.

స్పందించిన కమిషన్‌ 2022, నవంబర్‌ 29న జీవోలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్‌ ఉత్తర్వుల కారణంగా బీసీ, ఓసీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని బీసీ, ఓసీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ కొండెపాక కుమారస్వామి, మరికొందరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ కె.శరత్‌ విచారణ చేపట్టగా పిటిషనర్‌ తరఫున సుంకర చంద్రయ్య వాదనలు వినిపించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జాతీయ ఎస్సీ కమిషన్‌ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేశారు. ప్రభుత్వసంస్థల ఉద్యోగుల సర్వీసు అంశాలపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు విచారణ జరిపే అధికారం లేదని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. 

వివరాలను సమర్పించండి
విద్యుత్‌సంస్థల్లో పదోన్నతుల్లో ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ఇచ్చిన ప్రమోషన్లు అన్నింటిని సమీక్షించాలని 2019లో హైకోర్టు విద్యుత్‌ సంస్థలను ఆదేశించింది. అయినా ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీలపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నతన్యాయస్థానం ఫిబ్రవరి 8న వివరాలను సమర్పించాలని యాజమాన్యాలను ఆదేశించింది.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు