Breaking News

కలెక్టర్‌ను నిందితుడిగా ఎందుకు చేర్చలేదు?

Published on Wed, 11/12/2025 - 04:32

సాక్షి, హైదరాబాద్‌: చెరువు శిఖం భూమిలో మందిర నిర్మాణానికి కలెక్టర్‌ అనుమతి ఎలా ఇస్తారని, నిధులు ఎలా విడుదల చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఏ చట్ట ప్రకారం నిధులు విడుదల చేశారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఈ కేసులో కలెక్టర్‌ను నిందితుడిగా ఎందుకు చేర్చలేదని పోలీసులను అడిగింది. ఇరుపక్షాలు పూర్తి వివరాలతో రావాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

భూపాలపల్లి పట్టణంలో పుల్లూరి రామయ్యపల్లి శివారు చెరువు శిఖంలో అక్రమ నిర్మాణం చేపట్టారని నాగవెల్లి రాజలింగమూర్తి 2024, జనవరిలో స్థానిక కోర్టును ఆశ్రయించారు. శిఖం భూమి 2 ఎకరాలు కబ్జా చేసి వెంకటేశ్వరస్వామి ఆలయంతోపాటు వాణిజ్య భవనాన్ని నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు.. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి, గండ్ర గౌతమ్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. 

జనవరి 16న తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ నిందితులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.  పిటిషనర్‌ తరఫున సుధాంశురావు వాదనలు వినిపిస్తూ.. రెండు పిటిషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. చార్జిషీట్‌ దాఖలు చేసిన తర్వాత మళ్లీ పిటిషన్‌ వేస్తామని చెప్పారు. 

దర్యాప్తు కొనసాగుతోందని.. ఈ దశలో కోర్టు జోక్యం చేసుకుని నిందితులను చేర్చడంపై వ్యాఖ్యలు చేయొద్దని సుధాంశురావు కోరగా, న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపసంహరణకు నిరాకరిస్తూ.. కలెక్టర్, పో లీసుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్‌ జో క్యం ఉండటంతో చార్జిషీట్‌ దాఖలు చేయడం తా త్సారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

అధికారుల నుంచి పత్రాలు అందని కారణంగా ఆలస్యం జరిగిందని ఏపీపీ చెప్పగా.. మరి, రెండే ళ్లుగా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చెరువులో మందిర నిర్మాణానికి కలెక్టరే అనుమతి ఇస్తే.. ఇక రేపు చెరువులన్నీ ఇలాగే మారతాయన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)