పావురాల ఆహార నియంత్రణపై ఏం చర్యలు తీసుకున్నారు?

Published on Thu, 07/23/2026 - 09:31

సాక్షి, హైదరాబాద్‌: జంట నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడంతో ప్రజారోగ్యం, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందన్న అంశంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలను అఫిడవిట్‌ రూపంలో సమరి్పంచాలని రాష్ట్ర ప్రభుత్వం, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) తదితర ప్రతివాద అధికారులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 25కు వాయిదా వేసింది.

పావురాల కారణంగా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందంటూ ముషీరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రాధేశ్యామ్‌ తపాడియా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్‌) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ న్యాయవాది దీపక్‌ మిశ్రా వాదనలు వినిపిస్తూ.. హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరాల్లోని నివాస కాలనీలు, ఆసుపత్రులు, ప్రజా ప్రదేశాలు, చారిత్రక కట్టడాల వద్ద పావురాలకు నిర్బంధం లేకుండా ఆహారం వేయడంతో ఆరోగ్య సమస్యలు, పర్యావరణ కాలుష్యం పెరుగుతున్నాయన్నారు. అనుమతి లేకుండా ఆహారం వేస్తున్న వారిపై జరిమానాలు విధించేలా, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పులను అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. పావురాలకు ఆహారం వేయడాన్ని నియంత్రించేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను తెలియజేయాలని ప్రతివాదులను ఆదేశించింది.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)