Breaking News

భవిష్యత్‌ తరాలను కాపాడాలి

Published on Fri, 07/26/2024 - 04:27

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు పెంచి భవిష్యత్‌ తరాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని హైకోర్టు గుర్తు చేసింది. ఆ బాధ్యతను మరిచిపోకుండా చర్యలు చేపట్టాలని, ఏం చర్యలు చేపట్టారో నివేదిక అందజేయాలని ఆదేశించింది. అలాగే ప్రజా ప్రయోజన వ్యా­జ్యం (పిల్‌)తో సంబంధం లేదన్న జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎనిమిదేళ్లుగా విచారణ సాగుతున్నా జీహెచ్‌ఎంసీ ప్రతివాదో.. కాదో.. కూడా తెలియదా అని అసహనం వ్యక్తం చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఇలాగేనా వ్యవహ­రించేది అని ప్రశ్నించింది.

తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా వేసింది. ‘పట్టణాలు, నగరా­ల్లో పార్కుల అవసరం ఎంతైనా ఉంది. ఉన్నవాటి పరిరక్షణతో పాటు లేని చోట్ల కొత్తగా ఏర్పాటు చేయాలి. చెట్లను కూడా అభివృద్ధి చేయాలి. ఆ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి’అని కోరుతూ హైదరాబాద్‌ హిమాయత్‌­సాగర్‌కు చెందిన కె.ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో 2016లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌ కుమార్‌ ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.

అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ.. 2023, ఆగస్టు చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 749 హెక్టార్లలో 8.37 లక్షల మొక్కలు నాటినట్లు అటవీ శాఖ నివేదిక ఇచ్చిందన్నారు. హైదరాబాద్‌లో పరిస్థితి ఏంటని సీజే ప్రశ్నించగా...నగర అధికారులు ఎవరూ అందు­బాటులో లేరని, అయినా ఆ వివరాలు తెలుసు­కుని చెబుతామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం..తదుపరి విచారణలోగా దీనిపై నివేదిక అందజే యాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)