Breaking News

ఉత్తర్వులేకాదు.. అమలు బాధ్యతా సర్కార్‌దే

Published on Fri, 01/30/2026 - 04:47

సాక్షి, హైదరాబాద్‌: స్కాలర్‌షిప్‌ల బకాయిల కారణంగా విద్యార్థులకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరించకూడదంటూ ఉత్తర్వులు జారీ చేయడమే కాదు.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా సర్కారుదేనని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, విచారణకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణలోగా నివేదిక అందజేయాలని చెప్పింది. తదుపరి విచారణ మార్చి 3కు వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. 

పెండింగ్‌ స్కాలర్‌ షిప్‌లను వెంటనే విడుదల చేసేలా సర్కార్‌ను ఆదేశించాలని కోరుతూ అణగారిన వర్గాల సామాజిక ఆర్థిక సాధికారత సంఘం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రైవేట్‌ కళాశాలలు విద్యార్థుల సరి్టఫికెట్లను నిలిపివేయడంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని పేర్కొంది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. 

ఒరిజినల్‌ సర్టిఫికెట్లు నిరాకరించే కాలేజీలపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏదైనా టోల్‌–ఫ్రీ నంబర్, హెల్ప్‌ డెస్క్‌ అందుబాటులో ఉందా అని అడిగింది. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలకు ఓ యంత్రాంగం లేకపోవడాన్ని తప్పుబట్టింది. దీంతో బాధితులంతా కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుందని అభిప్రాయపడింది.    

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)