Breaking News

పరీక్షలకు ఫాతిమాను అనుమతించండి

Published on Sun, 12/22/2024 - 04:20

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫీజు కట్టలేక గత పరీక్షలకు హాజరుకాలేకపోయిన వైద్య విద్యారి్థని అర్షియా ఫాతిమా (పిటిషనర్‌)ను.. 2025, జనవరిలో జరిగే బీడీఎస్‌ చివరి సంవత్సరం పరీక్షలకు అనుమతించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. 

మాజీ సైనికుడి కూతురైన ఫాతిమా 2016లో నిజామాబాద్‌లోని మేఘన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌లో బీడీఎస్‌లో చేరారు. 2017, 2018లో పరీక్షలకు హాజరయ్యారు. 2020లో మూడో ఏడాది పూర్తి చేశారు. 2021 నుంచి ఆర్థిక పరిస్థితుల కారణంగా నాలుగో ఏడాది ఫీజు కట్టలేక పరీక్షలకు హాజరుకాలేదు. 2024లో బీడీఎస్‌ చివరి సంవత్సరం పరీక్షలు రాసేందుకు అనుమతించాలని ఫాతిమా వర్సిటీకి దరఖాస్తు చేసుకున్నారు. 

అయితే అక్టోబర్‌ 28న వర్సిటీ దీన్ని తిరస్కరించింది. తనను బీడీఎస్‌ చివరి సంవత్సరం పరీక్షలకు అనుమతించకపోవడాన్ని, ఇంటర్న్‌íÙప్‌ పూర్తి చేయకుండా అడ్డుకోవడాన్ని సవాల్‌ చేస్తూ ఫాతిమా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశా రు. 2025, జనవరిలో జరిగే పరీక్షలకు అనుమతి ఇచ్చేలా వర్సిటీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. 

పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ ఒక్కసారికి అనుమతించాలని వర్సిటీని ఆదేశిస్తూ, విచారణ ముగించింది.    

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి