ఓపెన్‌ ప్లాట్లే ఇవ్వండి 

Published on Sat, 11/11/2023 - 03:42

సాక్షి, హైదరాబాద్‌: 1991లో ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం 320 మంది ఉద్యోగులకు ఓపెన్‌ ప్లాట్లు రిజిస్ట్రేషన్   చేసి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్లాట్లను ఫ్లాట్లు మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 32ను కొట్టివేసింది. ఏపీ హౌసింగ్‌ బోర్డు ఉద్యోగులకు హైదరాబాద్‌ కూకట్‌పల్లి సర్వే నంబర్‌ 964, 1009లో 13 ఎకరాలను ప్రభుత్వం 1991లో కేటాయించింది. గజం రూ.45 చొప్పున కేటాయించాలని చెబుతూ ప్లాట్లను సిద్ధం చేసే బాధ్యతను హౌసింగ్‌ బోర్డుకు అప్పగించింది.

అయితే లేఅవుట్‌ సిద్ధమయ్యాక ఆ మొత్తాన్ని రూ.116కు పెంచింది. దీనిపై చర్చ కొనసాగుతుండగానే కేటాయింపును నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాట్లకు బదులు ఫ్లాట్లను కేటాయించాలంటూ జీవో 32ను విడుదల చేసింది. దీన్ని ఉద్యోగులు హైకోర్టులో సవాల్‌ చేశారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి ప్రభుత్వం పేర్కొన్న విధంగా రూ.116 చెల్లించిన 107 మందికి ప్లాట్లను అప్పగించాలని తీర్పునిచ్చారు.

దీన్ని సవాల్‌ చేస్తూ ప్రభుత్వం, హౌసింగ్‌బోర్డు, మరికొందరు అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. ప్రభుత్వం ఉద్యోగుల నుంచి సొమ్ము వసూలు చేసినందున ఆ భూమిపై వారికే హక్కులు ఉంటాయని పేర్కొంది. ఉద్యోగులకు ప్లాట్లు కేటాయించడం కొత్తకాదని, జీవో 32ను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. మొత్తం 320 మందికి ప్లాట్లను 4 నెలల్లో రిజి్రస్టేషన్‌ చేసి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.   

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)