ఊహాగానాలతో నిర్ణయాలు కుదరదు

Published on Wed, 07/23/2025 - 04:44

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ వినియోగానికి, రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంటుందన్న ఊహాగానాలతో వాహన మార్పిడిని అడ్డుకోలేరని రవాణా శాఖ అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఇన్నోవా (ట్రాన్స్‌పోర్టు) వాహనాన్ని.. మ్యాక్సీ క్యాబ్‌ నుంచి ఓమిని బస్‌ (నాన్‌ ట్రాన్స్‌పోర్టు)గా మార్చడానికి నిరాకరించే నిబంధనలు చట్టంలో లేనప్పుడు అందుకు ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులు కాపీ అందిన నాటి నుంచి ఆరు వారాల్లో చట్టప్రకారం ఓమిని బస్‌గా మార్పు చేయాలని రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది. 

తన ఇన్నోవా వాహనాన్ని మాక్సీ క్యాబ్‌ నుంచి ఓమిని బస్‌గా మార్చడానికి తిరస్కరిస్తూ 2022, 2025లో రవాణా శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన రత్నాజీరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె శరత్‌ మంగళవారం విచారణ చేపట్టారు. వాహనాన్ని ఓమిని బస్‌గా మార్చేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకుని పన్నులు, చార్జీల కింద రూ.2 లక్షల డీడీని కూడా పిటిషనర్‌ తీసుకున్నట్లు అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

వాహనం మార్పునకు అధికారులు నిరాకరించడంతో 2022లో పిటిషనర్‌ ఇదే హైకోర్టును ఆశ్రయించారని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించినా పిటిషనర్‌ దరఖాస్తును అధికారులు మరోసారి 2025, మార్చిలో తిరస్కరించారని చెప్పారు. వాహన మార్పు కారణంగా సర్కార్‌ ఆదాయానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. 

అక్రమంగా వాహనాన్ని మానవ రవాణా కోసం వినియోగించే అవకాశం కూడా ఉందని అనుమానం వ్యక్తంచేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మార్పిడిపై నిషేధానికి సంబంధించి రవాణా శాఖ అధికారులు ఎలాంటి నిబంధనలు సమరి్పంచలేదని, ఊహలతో తిరస్కరణ సరికాదని చెప్పారు. 6 వారాల్లో వాహనం మారి్పడికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు.   

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)