Breaking News

పీఎఫ్‌సీఎస్, డీఎఫ్‌సీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించండి

Published on Sun, 12/15/2024 - 05:31

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రాథమిక మత్స్యకారుల సహకార సంఘాలు (పీఎఫ్‌సీఎస్‌), జిల్లా స్థాయి మత్స్యకారుల సహకార సంఘాలకు (డీఎఫ్‌సీఎస్‌) ఎన్నికలు నిర్వహించాలని సహకార శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. గతంలో పిటిషనర్లు ఇచ్చిన వినతి పత్రంపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. పిటిషన్‌ను అనుమతిస్తూ, విచారణ ముగించింది. గ్రామస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో మత్స్యకారుల సహకార సంఘాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించడం లేదంటూ హైకోర్టులో హనుమకొండకు చెందిన డీఎఫ్‌సీఎస్‌ చీఫ్‌ ప్రమోటర్‌ బుస్సా మల్లేశంతో పాటు మరో ఏడుగురు చీఫ్‌ ప్రమోటర్లు పిటిషన్‌ దాఖలు చేశారు.

12 జిల్లాల పరిధిలో ఎన్నికలు నిర్వహించారని, మిగిలిన 21 జిల్లాల పరిధిలో కూడా వెంటనే నిర్వహించాలని కోరుతూ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కో ఆపరేటివ్‌ రాష్ట్ర ఎన్నికల అథారిటీకి సెప్టెంబర్‌ 23న వినతిపత్రం సమర్పించినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అందుకే మరో మార్గంలేక హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. పిటిషనర్లు వినతిపత్రం సమర్పించినా అధికారులు ఎన్నికలు నిర్వహించడం లేదని వారి తరఫున న్యాయవాది డీఎల్‌ పాండు వాదనలు వినిపించారు.

ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. సెప్టెంబర్‌ 9న సహకార మంత్రి సమావేశం నిర్వహించి సమస్యను వివరిస్తూ, ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులను తొలగించాలని చెప్పారని పేర్కొన్నారు. అయినా అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేయడం లేదని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని సహకార శాఖ అధికారులను ఆదేశిస్తూ, విచారణ ముగించారు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)