Breaking News

వారంలోగా నిర్ణయం తీసుకోండి: టూరిజం ఎండీ సస్పెన్షన్‌ ఎత్తివేతపై హైకోర్టు

Published on Sat, 12/30/2023 - 08:43

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ బోయినపల్లి మనోహ ర్‌రావు సస్పెన్షన్‌ ఎత్తివేతపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో ఆశాఖ ముఖ్యకార్యదర్శికి కోర్టుధిక్కారం కింద నోటీసులు జారీచేసి విచారణ జరపాల్సి ఉంటుందని హెచ్చ రించింది. తదుపరి విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ మనోహర్‌రావును సస్పెండ్‌ చేస్తూ గతనెల 17న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో రాష్ట్రమంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి ఎండీతోపాటు ఓఎస్డీ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మనోహర్‌రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అధికారిక సమావేశంలో భాగంగా తిరుమ ల వెళ్లానని పేర్కొన్నారు.

దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఎన్నికల సస్పెన్షన్లు దీర్ఘకాలం కొనసాగించాల్సిన అవసరంలేదని, సస్పెన్షన్‌ ఎత్తి వేతపై నిర్ణయం తీసుకోవాలని గత విచారణ సందర్భంగా ఆదేశించింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం మరోసారి విచా రణ చేపట్టింది. తమ ఆదేశాలపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)