Breaking News

‘ప్రైవేట్‌’కు ఇచ్చే అధికారం కలెక్టర్‌కు లేదు

Published on Sun, 04/27/2025 - 05:10

సాక్షి, హైదరాబాద్‌: భూముల వర్గీకరణ, రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీలకు సంబంధించిన వివాదాల్లో జోక్యం చేసుకుని, ఉత్తర్వులు జారీ చేసే అధికారం కలెక్టర్‌కు ఉండదని హైకోర్టు తేల్చిచెప్పింది. సివిల్‌ కోర్టులకు మాత్రమే అలాంటి అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మారుస్తూ కలెక్టర్‌ కొత్తగా సర్వే నంబర్‌ కేటాయించడం చట్టవిరుద్ధమని చెప్పింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్, మోకిల గ్రామాల మధ్య ఉన్న 40.12 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని తేల్చుతూ సర్వే శాఖ, తహసీల్దార్‌ 2014లోనే ఉత్తర్వులు జారీ చేసినా, జిల్లా కలెక్టర్‌ దాన్ని ప్రైవేటు వ్యక్తుల పేర్లపై రికార్డుల్లోకి చేర్చుతూ ప్రొసీడింగ్స్‌ ఇవ్వడాన్ని తప్పుబట్టింది.

వెంటనే ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌ సర్వే నంబర్‌ 398/ఏ, 400/ఏ, 402/ఏ, 402/ఏ1/1 లోని 2.14 ఎకరాల భూమిని 2008లో చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, తన పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కృష్ణరామ్‌ భూపాల్‌ అనే వ్యక్తి కబ్జా చేసి తమకు దారి ఇవ్వడం లేదంటూ జూబ్లీహిల్స్‌కు చెందిన శైలజ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆక్రమించిన 20.12 ఎకరాల ప్రభుత్వ భూమి ‘బిలా దాఖలా’(ఎవరికీ చెందనిది, ఏ సర్వే నంబర్‌లో లేనిది) కేటగిరీ కిందకు వస్తుందన్నారు. 

ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ 2022, 2023లో కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ భూ వివాదంపై 2014లో పిటిషన్‌ వేశామన్నారు. అప్పుడు సర్వే చేసిన అధికారులు 40.12 ఎకరాలు బిలాదాఖలా భూమిగా (ప్రభుత్వ భూమిగా) తేల్చారన్నారు. అందులో 20.12 ఎకరాలు ఆక్రమణల్లో ఉందని తహసీల్దార్‌ కౌంటర్‌ కూడా వేశారని చెప్పారు. ఇదిలా ఉండగా, ఆ భూమిని పట్టా భూమిగా పేర్కొంటూ విలేజ్‌ మ్యాప్‌ను మార్చాలని 2022లో కలెక్టర్‌ సర్వే శాఖకు ప్రొసీడింగ్స్‌ ఇచ్చారని నివేదించారు. 

2023లో కొత్త సర్వే నంబర్లతో ప్రైవేటు వ్యక్తుల పేర్లను రికార్డుల్లో చేర్చారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సదరు భూములపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించడం, భూమిని ఇతరుల పేరు మీదకు మార్చడం చేయొద్దని పిటిషనర్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను జూన్‌ 21కు వాయిదా వేశారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)