Breaking News

రాజ్యాంగం ప్రకారమే ఉత్తర్వులు

Published on Fri, 11/29/2024 - 04:37

సాక్షి, హైదరాబాద్‌: న్యాయస్థానాలు రాజ్యాంగం, చట్టప్రకారం మాత్రమే ఉత్తర్వులు ఇవ్వగలవని హైకోర్టు స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఉత్త ర్వులు ఇవ్వలేమని చెప్పింది. ఈ మేరకు దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది. ఒక పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన శాసనసభ్యులు వెంటనే మరో పార్టీలోకి ఫిరాయి స్తున్నారని.. ఇలాంటి వారి శాస నసభ సభ్యత్వాన్ని రద్దు చేసేలా ఎన్నికల కమిషన్‌కు ఆదే శాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

కాగా, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరుకాకుండా ఆదేశాలి వ్వాలని పాల్‌ మధ్యంతర అప్లికేషన్‌ (ఐఏ) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీని వాస్‌రావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మె ల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా నిషేధం విధించాలని కేఏ పాల్‌ కోరారు. 

ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మహిపాల్‌ రెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. స్పీకర్‌ అధికారాల్లో జోక్యం కోరుతూ వేసిన ఈ పిటిషన్‌ చెల్లదని, మధ్యంతర ఉత్తర్వులు కోరలేరని అన్నారు. పలువురి అనర్హత పిటిషన్లు స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది. 

Videos

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)