Breaking News

ఆస్తి ఉంటే అప్పులకూ వారసుల బాధ్యత: హైకోర్టు

Published on Sun, 07/05/2026 - 04:21

సాక్షి, హైదరాబాద్‌: మరణించక ముందు వ్యక్తి చేసిన చట్టబద్ధమైన అప్పుల నుంచి వారసులు పూర్తిగా తప్పించుకోలేరని హైకోర్టు స్పష్టం చేసింది. తండ్రి లేదా ముందు తరం వారు చేసిన అప్పుల బాధ్యత, వారసత్వంగా వచ్చిన ఆస్తులపై కొనసాగుతుందని స్పష్టం చేసింది. రెవెన్యూ రికవరీ చట్టం కింద అధికారుల చర్యలు చట్టబద్ధమేనని చెబుతూ, కామారెడ్డి జిల్లాకు చెందిన యశోద దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. యశోద భర్త జలాల్‌పూర్‌ బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌గా పనిచేసే సమయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) నిధుల్లో రూ.14.89 లక్షలు అక్రమంగా మళ్లించినట్లు ఆరోపణలొచ్చాయి. 

దీనిపై విచారణ జరిపిన అధికారులు అక్రమ వినియోగం జరిగినట్లు నిర్ధారించి, ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జలాల్‌పూర్‌లోని వ్యవసాయ భూములను జప్తు చేసి వేలం వేయడానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. దీన్ని సవాల్‌ చేస్తూ యశోద హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ లక్ష్మీనారాయణ అలిశెట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..ఆ భూములు యశోద భర్త సంపాదించినవి కాదని, పూర్వీకుల నుంచి సంక్రమించిన వారసత్వ ఆస్తులని చెప్పారు. 

పిటిషనర్‌తోపాటు ఆమె ఇద్దరు కుమారులు కూడా ఆ ఆస్తులపై హక్కుదారులన్నారు. భర్త చేసిన అప్పులకు మొత్తం భూమిని వేలం వేయడం చట్టవిరుద్ధమని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. హిందూ వారసత్వ చట్ట సవరణలపై స్పష్టత ఇచ్చారు. 2005 సవరణతో ‘పయస్‌ అబ్లిగేషన్‌’(తండ్రి అప్పులు తీర్చాల్సిన పుత్ర ధర్మం) సిద్ధాంతంలో మార్పులు వచ్చి నా, మరణించిన వ్యక్తి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తుల నుంచి మాత్రం బకాయిల చెల్లింపు బాధ్యత కొనసాగుతుందన్నారు. పిటిషనర్‌ స్వయంగా భూమి పూర్వీకుల ఆస్తేనని అంగీకరించిన తర్వాత, రికవరీ చర్యలను ప్రశ్నించలేరని తేల్చిచెప్పారు.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)