Breaking News

భూ వేలాన్ని ఆపలేం

Published on Thu, 07/15/2021 - 01:14

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట, ఖానామెట్‌లోని ప్రభుత్వ భూముల్ని వేలం వేయడాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌లో తుది విచారణకు లోబడి ఆ వేలం ప్రక్రియ ఉంటుందన్న ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అటువంటి ఆదేశాలు ఇస్తే కొనేవారు భయపడతారని, అలాగే తక్కువ ధరను కోట్‌ చేస్తారని, తర్వాత ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం జరుగుతుందని అభిప్రాయపడింది. అయితే ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ భూములను వేలం వేయాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎంపీ ఎం.విజయశాంతి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. ఆక్రమణల నుంచి కాపాడలేక, నిధులను సమకూర్చుకునేందుకు ఈ భూముల్ని వేలం వేస్తున్నామని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు.  

ప్రభుత్వమే కాపాడలేకపోతే ఎలా ? 
‘ఆక్రమణదారుల నుంచి కాపాడలేక ప్రభుత్వ భూముల్ని వేలం ద్వారా విక్రయిస్తున్నామని ప్రభుత్వం పేర్కొనడం ఆశ్చర్యకరం. ప్రభుత్వమే తన భూముల్ని కాపాడుకోలేకపోతే ఇక ప్రజల భూముల్ని ఏం కాపాడుతుంది. భూముల్ని కాపాడేందుకు వాటి చుట్టూ కంచె ఏర్పాటు చేయండి. ప్రతి జిల్లాకు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలని ఒకవైపు చెబుతున్నారు. మరోవైపు ఉన్న భూముల్ని వేలం ద్వారా విక్రయిస్తున్నారు. ప్రభుత్వం తానిచ్చిన ఆదేశాల అమలులో పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వేలం ప్రక్రియను ఎలా సమర్థించుకుంటుంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయండి’అని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్‌ 8కు వాయిదా వేసింది.    

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)