Breaking News

నంబర్‌ ప్లేట్‌ లేకుంటే చీటింగ్‌ కేసా?

Published on Sun, 09/15/2024 - 05:06

సాక్షి, హైదరాబాద్‌: నంబర్‌ ప్లేట్‌ లేకుండా వాహనం నడిపిన ఓ వ్యక్తిపై చీటింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇష్టం వచ్చిన సెక్షన్ల కింద కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించింది. చార్మినార్‌ పోలీసులు తనపై తప్పుడు సెక్షన్ల కింద దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో వసుందర్‌చారి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.సుజన విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు.

 పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఆకాశ్‌ బాగ్లేకర్‌ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి..‘పిటిషనర్‌పై ఉన్న ఒకే ఒక ఆరోపణ నంబర్‌ ప్లేట్‌ లేకుండా వాహనాన్ని నడపటం. ఆ వాహనాన్ని కూడా సీజ్‌ చేశారు. ఈ నేరం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ) సెక్షన్‌ 420 పరిధిలోకి రాదు. అంతేకాకుండా, సెక్షన్‌ 80(ఏ) కింద శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ అభియోగాలు మోపారు. వాహనాల పరి్మట్‌ కోసం దరఖాస్తు చేయడం, మంజూరు విధానం గురించి ఈ సెక్షన్‌ చెబుతుంది. 

కాబట్టి, నంబర్‌ ప్లేట్‌ లేకుండా వాహనం నడిపినా సెక్షన్‌ 80(ఏ)కి వర్తించదు. పిటిషనర్‌ నంబర్‌ ప్లేట్‌ లేకుండా వాహనం నడిపితే నిబంధనల ప్రకారం పోలీసులు జరిమానా విధించాలి లేదా కేసు నమోదు చేయాలి. ఈ కారణంగా పిటిషనర్‌పై నమోదు చేసిన సెక్షన్లను రద్దు చేస్తున్నాం’అని పేర్కొన్నారు.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)