Breaking News

‘స్థానికత’పై వర్సిటీ తీరు సరికాదు

Published on Fri, 09/27/2024 - 04:37

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విద్యా అడ్మిషన్లకు సంబంధించి కాళోజీ నారాయణరావు హెల్త్‌ వర్సిటీ ‘స్థానికత’పై వ్యవహరిస్తున్న తీరును హైకోర్టు తప్పుబట్టింది. నేరుగా ప్రభుత్వం సిఫార్సు చేసిన సైనిక పాఠశాల విద్యార్థిని స్థానిక అభ్యర్థిగా పరిగణించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థిని స్థానికుడిగా పరిగణించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వ  సిఫార్సు మేరకు రంగారెడ్డి జిల్లా వనస్థలిపురానికి చెందిన చేపూరి అవినాశ్‌ డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ   ఇండియన్‌ మిలిటరీ స్కూల్‌లో 8 నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించారు. 

రాష్ట్ర కోటా నుంచి అతను ఎంపికయ్యారు. ఆ తర్వాత ఇంటరీ్మడియట్‌ తెలంగాణలో పూర్తి చేశారు. ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల సమయంలో అతను తెలంగాణలో 9, 10 చదవలేదని పేర్కొంటూ స్థానిక అభ్యర్థిగా పరిగణించడానికి విశ్వవిద్యాలయం నిరాకరించింది. దీన్ని సవాల్‌ చేస్తూ హైకో ర్టులో అవినాశ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున ఎ.వెంకటేశ్, ప్రభుత్వం తరఫున ఏజీపీ స్వప్న, కాళోజీ వర్సి టీ తరఫున ఎ.ప్రభాకర్‌రావు హాజరయ్యారు. 

రెండు రోజుల క్రితం విచారణ సందర్భంగా పిటిషనర్‌ స్థానిక అభ్యర్థే కదా అని ధర్మాసనం అభిప్రాయపడింది. సమస్యను పరిష్కరించాలని వర్సిటీకి సూ చించింది. అయితే గురువారం విచారణ సందర్భంగా స్థానికుడిగా పరిగణించలేమని వర్సిటీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. వర్సిటీ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థి నాన్‌ లోకల్‌ ఎలా అవుతారో సర్కార్‌ను అడిగి చెప్పాలని ఏఏజీని ఆదేశించింది. తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది.   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)