Breaking News

Hyderabad: విలాసవంతమైన వసతిగా హెలీప్యాడ్‌

Published on Sun, 06/22/2025 - 09:43

గ్రేటర్‌లో హైరైజ్‌ బిల్డింగ్స్‌ అంతకంతకూ పెరుగుతున్నాయి. నగరం చుట్లూ పెద్దపెద్ద వెంచర్లు మొదలవుతున్నాయి. కస్టమర్లలోనూ హైరైజ్‌ నివాసాలపై ఆసక్తి పెరిగింది. దీంతో నిర్మాణ సంస్థలు పోటాపోటీగా హైరైజ్‌ అపార్ట్‌మెంట్లను నిరి్మస్తున్నాయి. ఇక వీటిల్లో వసతులు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన వసతులతో కస్టమర్లను ఆకర్షించేందుకు పలు నిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు హైరైజ్‌ భవనాలపైన హెలీకాఫ్టర్‌లు ల్యాండ్‌ అయ్యేందుకు అవసరమైన హెలీప్యాడ్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఇది నగరంలో లగ్జరీ ట్రెండ్‌గా మారింది.  

సాక్షి, హైదరాబాద్: హైరైజ్‌ భవన నిర్మాణాలకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తుండటంతో వాటిల్లో విలాసవంతమైన వసతులు పెరుగుతున్నాయి. గతంలో కస్టమర్లు స్విమ్మింగ్‌ పూల్, జిమ్‌ వంటి వసతులనే లగ్జరీగా భావించేవారు. కానీ, ప్రస్తుతం మాత్రం విదేశాల్లో మాదిరిగా అంతర్జాతీయ స్థాయి వసతులను కోరుకుంటున్నారు. దీంతో గోల్ఫ్‌ కోర్ట్, హెలీప్యాడ్, స్కైవాక్‌ వంటి విలాసవంతమైన వసతులను సైతం నిర్మాణ సంస్థలు అందిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌లో ఆకాశహార్మ్యం పైకప్పులపై హెలీప్యాడ్ల నిర్మాణానికి డెవలపపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. 

⇒ ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలలో లగ్జరీ అపార్ట్‌మెంట్లు, హోటళ్ల పైకప్పులపై హెలీప్యాడ్‌లు సర్వసాధారణమైపోయాయి. లగ్జరీ, హోదా చిహ్నంగా ఇవి ఉన్నప్పటికీ..అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల సమయంలో నివాసితులను తరలించేందుకు ఇవి ఎంతో ఉపయుక్తం. మన నగరంలో కోకాపేట, నానక్‌రాంగూడ, తెల్లాపూర్, పుప్పాలగూడ, మాదాపూర్, గచి్చ»ౌలి, కూకట్‌పల్లి వంటి పశ్చిమ హైదరాబాద్‌లోనే హెలీప్యాడ్‌ భవన నిర్మాణాలు ఎక్కువగా వస్తున్నాయి.

ఇప్పటివరకు ఐదు ప్రాజెక్ట్‌లు.. 
హైరైజ్‌ బిల్డింగులపై హెలీప్యాడ్‌లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటి వరకు ఐదు సంస్థలు జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేశాయి. వీటికి అనుమతి లభించింది. జీహెచ్‌ఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్, టౌన్‌ప్లానింగ్‌ డైరెక్టర్, హెచ్‌ఎండీఏ చీఫ్‌ సిటీ ప్లానర్, రోడ్లు భవనాల విభాగం ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లతో కూడిన నలుగురు సభ్యుల కమిటీ హెలిప్యాడ్‌ కోసం నిర్మాణ సంస్థల నుంచి వచి్చన దరఖాస్తులను పరిశీలించి, నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటివరకు కూకట్‌పల్లి, నానక్‌రాంగూడ, నియోపోలిస్‌ ప్రాంతాలలోని పలు లగ్జరీ అపార్ట్‌మెంట్లు, మాదాపూర్‌లోని ఓ హోటల్‌ పైకప్పుపై హెలీప్యాడ్‌ నిర్మాణానికి అనుమతులు జారీ అయ్యాయి. లోధా, ఎల్‌అండ్‌టీ–ఫోనిక్స్, మంజీరా, మంత్రి, జీహెచ్‌ఆర్‌ వంటి సంస్థలు ఈ విలాసవంతమైన సౌకర్యాన్ని అందిస్తున్నాయి. \\60 మీటర్ల కంటే ఎత్తయితే.. 

జాతీయ భవన నిర్మాణ నియమావళి (ఎన్‌బీసీ) నిబంధనల ప్రకారం 60 మీటర్ల కంటే ఎత్తయిన భవన నిర్మాణాలకు హెలిప్యాడ్‌లు తప్పనిసరి. 1999లో ఈ నిబంధన అమలులోకి వచ్చినప్పటికీ హైదరాబాద్‌లో 60 మీటర్ల కంటే ఎత్తయిన భవనాలు పెద్దగా లేవు. 2007 నుంచి 60 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తయిన ప్రాజెక్ట్‌లు వస్తుండటంతో హెలీ ప్యాడ్ల ఏర్పాటు తప్పనిసరిగా మారింది. పౌర విమానయాన శాఖ (డీజీసీఏ) నియమాలు, నిబంధనల ప్రకారమే నిర్మాణ సంస్థలు హెలీప్యాడ్‌లను నిరి్మంచాల్సి ఉంటుంది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)