Breaking News

సంక్రాంతి ఎఫెక్ట్‌.. భారీ ట్రాఫిక్‌ జామ్‌

Published on Sun, 01/11/2026 - 07:26

సాక్షి,హైదరాబాద్‌: విజయవాడ జాతీయ రహదారిపై వాహన రద్దీ భారీగా పెరిగింది. సంక్రాంతి పండుగకు ముందు శనివారం, ఆదివారం రావడంతో హైదరాబాద్‌లో నివసించే ప్రజలు తమ స్వగ్రామాల బాట పట్టారు. ఒకే సమయంలో వాహనాలు వేల సంఖ్యలో తరలిరావడంతో యాదాద్రి జిల్లా పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు అర కిలోమీటరు మేర నిలిచిపోయాయి.

ఒక దశలో ట్రాఫిక్‌ కిలోమీటరు మేర నిలిచిపోయింది. ఫాస్టాగ్‌ విధానం అమలులో ఉన్నప్పటికీ వాహనాలు పరిమితికి మించి రావడం, కొన్ని వాహనాల ఫాస్టాగ్‌లు స్కాన్‌ కాకపోవడంతోనే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయని టోల్‌ ప్లాజా నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నారు. రాచకొండ పోలీసులు, జీఎంఆర్‌ టోల్‌గేట్‌ సిబ్బంది వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.

కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద ఫాస్టాగ్ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టోల్ చెల్లింపులు సక్రమంగా జరగకపోవడంతో వాహనాలు నిలిచిపోయి, రద్దీ మరింత పెరిగింది. మరోవైపు జాతీయ రహదారి-65 పై వాహనాల జాతర కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో వాహనాల సంఖ్య పెరగడంతో రహదారి బ్లాక్ స్పాట్స్ వద్ద జాగ్రత్త చర్యలు కనిపించకపోవడం వాహనదారులను ఆందోళనకు గురి చేసింది.



టోల్ ప్లాజా వద్ద ఆలస్యం, ఫాస్టాగ్ సమస్యలు, రహదారి బ్లాక్ స్పాట్స్ వద్ద జాగ్రత్త చర్యలు లేకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)