Breaking News

భారీ వర్షాలు: తెలంగాణలో నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు

Published on Tue, 07/25/2023 - 21:19

సాక్షి, హైదరాబాద్‌: ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో బుధ, గురువారాలు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు. అనంతరం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్ని విద్యాసంస్థలకు బుధ, గురువారం సెలవులంటూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు వర్తిస్తుందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థల పరిస్థితిపై ప్రభుత్వం ఆరా తీసింది. దీంతో ఉన్నతాధికారులు జిల్లాల నుంచి సమాచారం సేకరించారు.
చదవండి: హైదరాబాద్‌ వర్షాలు.. ఆ ఏరియా వాళ్లు ఈ టైంకు ఆఫీస్‌లో లాగౌట్‌ చేయాల్సిందే

​​​​​​​అనేకచోట్ల విద్యార్థుల హాజరు తగ్గిందని, బడులకు వచ్చే అవకాశం లేదని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు. దాదాపు 6 వేల బడుల్లో 30 శాతం హాజరు కూడా కన్పించలేదని తెలిసింది. వర్షాలు పడుతుండటంతో బడుల్లో మధ్యాహ్న భోజనం వండటానికీ అష్టకష్టాలు పడుతున్నారు. భోజనం వండే అవకాశం ఉండటం లేదని, తరగతి గదులకు సమీపంలోని వరండాల్లో వండటం వల్ల పొగతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని పలువురు హెచ్‌ఎంలు చెప్పారు.

అన్నిచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించిందని, రాకపోకలు నిలిచిపోతున్నాయని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితులను అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం కేసీఆర్‌ స్పందించి సెలవులు ఇవ్వాలని మంత్రి సబితను ఆదేశించారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)