Breaking News

వర్షాలతో రోడ్లకు రూ.1,000 కోట్ల నష్టం

Published on Fri, 08/22/2025 - 01:34

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఆర్‌ అండ్‌ బీ శాఖ రోడ్లకు సుమారు రూ.1,000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అధికారులు నివేదించారు. రోడ్లతోపాటు పలుచోట్ల కల్వర్టులు, మైనర్‌ బ్రిడ్జ్‌లు, హైవే స్ట్రెచ్‌లు దెబ్బతిన్నట్లు చెప్పారు. రోడ్లకు జరిగిన నష్టంపై గురువారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా రహదారులకు జరిగిన నష్టంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 

రాష్ట్రంలో రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రస్తుత పరిస్థితిపై ఫీల్డ్‌ రిపోర్ట్‌ తయారు చేయాలని సూచించారు. పూర్తిగా శిథిలావస్థకు చేరిన కల్వర్టులు, మైనర్‌ బ్రిడ్జ్‌ల స్థానంలో కొత్తగా నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. త్వరలోనే హ్యామ్‌ విధానం ద్వారా నాణ్యమైన రోడ్లు వేయబోతున్నట్లు వెల్లడించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఆ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 

కేంద్రం నుంచి క్లియరెన్స్‌ రావాల్సిన జాతీయ ప్రాజెక్టులపై మంత్రి ఆరా తీశారు. ఖానాపూర్‌ నుంచి బెల్లంపల్లి, ఉట్నూర్‌ నుంచి గుడిహత్నూర్‌ రోడ్డు మార్గంపై ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఇచ్చిన వినతి పత్రంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ప్రభుత్వ స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌రాజ్, ఈఎన్సీ జయ భారతి, సి.ఈ రాజేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఈ ధర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌ను డర్టీ పార్టీ అనడం కేటీఆర్‌ అహంకారానికి నిదర్శనం 
దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్‌ పార్టీని డర్టీ పార్టీ అని దూషించటం బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ అహంకారానికి నిదర్శనమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ నీకు థర్డ్‌ గ్రేడ్‌ పార్టీలా కనిపిస్తుందా? అని గురువారం ఒక ప్రకటనలో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ నిలబెట్టిన ఉప రాష్ట్రపతి అభ్యర్థిని చూసి దేశం మొత్తం హర్షిస్తోందని తెలిపారు. తెలంగాణ బిడ్డను వ్యతిరేకిస్తే బీఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు.    

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)