Breaking News

25న అల్పపీడనం

Published on Mon, 09/22/2025 - 06:15

సాక్షి, హైదరాబాద్‌: తూర్పు మధ్య బంగాళా­ఖాతం..దాని సమీపంలోని ఉత్తర బంగాళా­ఖాతం ప్రాంతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది క్రమంగా బలపడి 24 గంట­ల తర్వాత పశ్చిమ వాయవ్య దిశలో కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం సమీపంలో వాయు­గుండంగా మారొచ్చు. ఇది దక్షిణ ఒడిశా, ఉత్త రాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈ నెల 27వ తేదీ ఉదయంకల్లా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్ల డించింది.

ఉత్తర అండమాన్‌ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు కొనసా గుతుంది. ఈశాన్య ఉత్తరప్రదేశ్, సమీప బిహార్‌ ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం పశ్చిమ విదర్భ వరకు కొనసా గుతుంది. వీటి ప్రభావంతో రానున్న రెండ్రో­జులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

25 శాతం అధిక వర్షపాతం 
ప్రస్తుత నైరుతి రుతుపవనాల సీజన్‌ సంతృప్తికర వర్షాలనే నమోదు చేసింది. నైరుతి సీజన్‌లో ఈనెల 21వ తేదీ నాటికి 69.78 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 87.44 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 25% అధికంగా నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 

⇒  నైరుతి సీజన్‌లో ఇప్పటివరకు మెదక్, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 18 జిల్లాల్లో అధిక వర్షపాతం, 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 
⇒  మండలాల వారీగా పరిశీలిస్తే... 103 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 272 మండలాల్లో అధిక వర్షపాతం, 2,333 మండలాల్లో సాధారణ వర్షపాతం, 13 మండలాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. 

ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పంజాబ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాల ఉపసంహరణ పూర్తయ్యింది. ఈ సమయంలో రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండడంతో వానలు సైతం భారీగా నమోదయ్యే అవకాశముంది. ఈ నెల 25న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో రాష్ట్రంలోనూ భారీ వర్షాల నమోదుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)