Breaking News

ఎడతెరిపి లేని వాన..

Published on Thu, 07/30/2026 - 00:36

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ములుగు/ఖానాపూర్‌: తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ములుగు జిల్లాలో భారీ వర్షం కారణంగా పలు వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో పలు ఏజెన్సీ గ్రామాలకు బాహ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వాజేడు మండల పరిధిలోని ఇసుక వాగు డైవర్షన్‌ రహదారిపై ప్రవహిస్తుండటంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు వాగు ఆవతలి వైపున ఉన్న 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 10 మీటర్లకు చేరుకుంది. 

⇒ మేడారం సమ్మక్క, సారలమ్మల దర్శనానికి వచ్చిన హైదరాబాద్‌ ఘట్‌కేసర్‌కు చెందిన కారు డ్రైవర్‌ తిమ్మయ్య జంపన్నవాగులో వరద ఉధృతికి గల్లంతయ్యాడు. 
⇒ వెంకటాపురం(కె) మండలంలోని పాలెం వాగు ప్రాజెక్టులోకి సామర్థ్యానికి మించి వరద చేరడంతో నాలుగు గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.  

ప్రాణహితకు పోటెత్తిన వరద  
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వాగులు, వంకలు పొంగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి ప్రాణహితకు వరద పోటెత్తుతోంది. కడెం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ఆసిఫాబాద్‌ జిల్లాలో వట్టివాగు ప్రాజెక్టు 6వేల క్యూసెక్కుల నీరు చేరడంతో మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సింగరేణికి శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 

⇒   మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గోడ కూలడంతో నిద్రిస్తున్న ఆత్రం మాంతయ్య, ఆయన భార్య లక్షి్మ, కొడుకులు అజయ్, అనిల్‌కు గాయాలయ్యాయి. వీరు చెన్నూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  

⇒ నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని చామ న్‌పల్లి గూడేనికి చెందిన మర్సుకోల పారుబాయి తన భర్త మధుకు సంబంధించిన వృద్ధాప్య పింఛన్‌ తీసుకోవడానికి ఎర్వచింతల్‌లోని పంచాయతీ కార్యాలయానికి అతడితో కలిసి వాగు దాటి వెళ్లింది. పింఛన్‌ తీసుకున్న అనంతరం నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడం కోసమని మధు గ్రామంలోకి వెళ్లాడు. ఈ సమయంలో భారీ వర్షం కురవడంతో అక్కడే ఆగిపోయాడు. భర్త గూడేనికి వెళ్లిపోయాడని భావించిన పారుబాయి ఒంటరిగా వాగు దాటేందుకు ప్రయతి్నంచింది. మధ్యలోకి వ చ్చిన తర్వాత ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో నీటిలో కొట్టుకుపోయి గల్లంతైంది. వర్షం తగ్గిన తర్వాత గూడేనికి చేరుకున్న మధు తన భార్య కనిపించకపోవడంతో గ్రామస్తులతో కలిసి బల్లివాగులో గాలింపు చేపట్టారు. కొంతసేపటి తర్వాత పారుబాయి(47) మృతదేహం లభ్యమైంది.  

⇒ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్‌ పట్టణంలోని చంద్రశేఖరకాలనీలోగల ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నీరు నిలవడంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్‌ ప్రాజెక్టులలోకి స్వల్పంగా ఇన్‌ఫ్లో వస్తోంది.  
⇒  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనూ భారీ వర్షం కురి సింది. జగిత్యాల జిల్లాలో వాగులువంకలు పొంగిపొర్లాయి. జిల్లాకేంద్రం శివారులోని వెంకటాద్రినగర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. కాలనీవాసులను మున్సిపల్‌ అధికారులు జేసీబీ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)