Breaking News

వెంటాడుతున్న వరద కష్టాలు

Published on Sat, 08/30/2025 - 05:43

సాక్షి, నెట్‌వర్క్‌: నిర్మల్‌ జిల్లాలోని భైంసా డివిజన్‌లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. మరోవైపు మహారాష్ట్ర నుంచి భారీగా వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోటెత్తిన వరద బాసర కాటేజీల్లోకి ప్రవేశించింది. వెంటనే పోలీసులు, అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎస్పీ జానకీ షర్మిల స్వయంగా అక్కడికి చేరుకుని, పరిస్థితి సమీక్షించారు. విపత్తు నియంత్రణ సహాయక బృందాలతో కాటేజీల నిర్వాహకులు, సిబ్బందిని క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కాగా బాసర ఆలయ అర్చకులు గోదావరి శాంతించాలంటూ స్నానఘాట్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఇలావుండగా..భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఐదుగేట్లు ఎత్తారు. సుద్ధవాగు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మెదక్‌ జిల్లా రామాయంపేట పట్టణంలో ఇళ్లలోకి వచ్చిన నీటిని తోడేందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. మెదక్‌ పట్టణంలో షాపుల్లో చేరిన నీటిని మోటార్లతో తోడుతున్నారు.

హైదరాబాద్‌ నుంచి మెదక్‌ –ఎల్లారెడ్డి–బాన్సువాడ మీదుగా నిజామాబాద్‌ జిల్లా కోటగిరి వరకు వెళ్లే 765డీ జాతీయ రహదారి ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. హైదరాబాద్‌–నాగ్‌పూర్‌ హైవే (44) కోతకు గురైన చోట్ల మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి.

హవేళీఘనపురం మండలం గంగమ్మవా గులో గల్లంతైన యాదగౌడ్‌ అనే మరో వ్యక్తి మృతదేహం శుక్రవారం లభించింది. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన పంపుకాడి నాగయ్య గల్లంతై మూడు రోజులైనా జాడ దొరకలేదు.  

రైలు పట్టాల ధ్వంసానికి కబ్జాలే కారణం
భారీ వర్షాలతో రామేశ్వర్‌పల్లి–తలమడ్ల రైల్వేస్టేషన్‌ల మధ్య 528 మైలురాయి వద్ద 50 మీటర్ల పొడవున ట్రాక్‌ కింద మట్టి కొట్టుకపోయి పట్టాలు గాల్లో తేలడానికి చెరువు అలుగు కాలువ ఆక్రమణలే కారణమని తెలుస్తోంది.

గణపతి విగ్రహం కోసం వచ్చి చిక్కుకుపోయిన చిన్నారులు
కామారెడ్డి జిల్లా లింగంపల్లికలాన్‌ గ్రామానికి చెందిన సుమారు పది మంది చిన్నారులు బుధవారం గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు మెదక్‌కు వచ్చారు. అయితే రెండు జిల్లాల మధ్య ప్రవహిస్తోన్న మంజీరా నది పోచారం డ్యామ్‌పై నుంచి ఉప్పొంగి ప్రవహించడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

దీంతో వారంతా రెండు రోజులుగా మెదక్‌లోనే ఉండిపోయారు. దీంతో శుక్రవారం ఉదయం ఎస్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌తో వారిని ఎల్లారెడ్డి వైపు తరలించేందుకు యత్నించారు. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రయత్నాన్ని విరమించుకున్నారు. చిన్నారులను మెదక్‌లోని పునరావాస శిబిరాలకు తరలించారు. 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)