Breaking News

పాలమూరులో దంచికొట్టిన వాన

Published on Fri, 08/15/2025 - 04:49

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. జోగుళాంబ గద్వాల జిల్లా మినహా మిగిలిన అన్ని చోట్ల వాగులు, కాల్వలు పొంగిపొర్లాయి. రహదారులు దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలు అలుగు పారాయి. 

మహబూబ్‌నగర్‌లోని హనుమాన్‌పురా, అప్పన్నపల్లిలోని రైల్వే అండర్‌ బ్రిడ్జీలకు ఉన్న రిటైనింగ్‌ వాల్స్‌ కూలిపోయాయి. దీంతో పాలిటెక్నిక్‌ కళాశాలకు వెళ్లే 1,000 మంది విద్యార్థులతోపాటు అటు వైపు ఉన్న గొల్లబండతండాకు రాకపోకలు నిలిచిపోయాయి.  జడ్చర్ల పరిధిలోని కావేరమ్మపేట వద్ద నల్లచెరువు కట్ట తెగి సమీపంలోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. 

⇒ జడ్చర్ల, మిడ్జిల్‌తోపాటు నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు, కల్వకుర్తి, ఉప్పునుంతల మండలాల్లో దుందుభి నది ఉధృతంగా ప్రవహించింది. మూసాపేట మండలంపోల్కంపల్లి వద్ద పెద్దవాగు మధ్యలో గొర్రెలు, వాటి కాపరులు చిక్కుకుపోగా రిస్క్‌ బృందం వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. 

⇒ మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ సమీపంలో దివిటిపల్లి నుంచి అమర్‌రాజా బ్యాటరీ కంపెనీకి వెళ్లే రోడ్డు వర్షం నీటికి పూర్తిగా ధ్వంసం కాగా.. గురువారం తెల్లవారుజామున సిబ్బందిని తీసుకువెళ్తున్న కంపెనీ బస్సు అందులో బోల్తా పడడంతో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. 

⇒  జడ్చర్ల వద్ద సర్వీస్‌రోడ్డుపై మోకాళ్లలోతు నీటి ప్రవాహంలో హైదరాబాద్‌ వెళుతున్న ఆర్టీసీ బస్సుతోపాటు, ఓ ప్రైవేట్‌ బస్సు తెల్లవారుజామున నిలిచిపోయాయి. దీంతో వరద నీటిలో చిక్కుకున్న 50 మంది ప్రయాణికులను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రోడ్డుపైకి తీసుకొచ్చారు. 

⇒  నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రం వద్ద కొండ చరియలు విరిగి పడ్డాయి. 
⇒ నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలంలో 14.46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లాలో మరికల్‌ 12.62, మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో 12.3 సె.మీ. వనపర్తి జిల్లాలో ఖిల్లాలాఘనపురంలో 11.68, పెద్దమందడిలో 10.33, వనపర్తిలో 9.88, సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వరద బీభత్సం
హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. లోలెవల్‌ బ్రిడ్జీల వద్ద వరద ప్రమాదకరంగా మారింది.నెమ్మికల్‌ దండుమైసమ్మ ఆలయ సమీపంలో సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపైకి వరద భారీగా చేరింది. మేళ్లచెర్వు– కోదాడ ప్రధాన రహదారిపై కందిబండ సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్డి వద్ద తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది.  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉద్యాన తోటలు నీట మునిగి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. పరిగి మండలం బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యాయత్‌నగర్, హనుమాన్‌గండి గ్రామాల్లో గురువారం తెల్లవారుజామున 3.55 గంటలకు 3 నుంచి 4 సెకన్ల పాటు భూమి కంపించింది. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పెద్దవాగు పరీవాహక ప్రాంతాల్లో ఉన్న  పత్తి చేలను వరద ముంచెత్తింది. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)