Breaking News

భారీ వరదలు..మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత

Published on Thu, 08/14/2025 - 11:24

రోజంతా ముసురు.. కురుస్తున్న వర్షంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు ప్రధాన రోడ్లు జలమయంగా మారగా.. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.దీంతో అటు వాహనదారులు..ఇటు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.   

మలక్‌పేట్‌జోన్‌ పరిధిలో కురిసిన వర్షానికి పలు కాలనీలు, బస్తీలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. అలాగే డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మలక్‌పేట్, చాదర్‌ఘాట్, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లోని ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్‌ స్తంభించింది.

తెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పాటు పైనుంచి వస్తున్న వరదతో మలక్‌పేట్‌లోని  మూసారాంబాగ్‌ బ్రిడ్జి వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిపిశారు. అంతేగాకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు మూసీ తీరవాసులను అప్రమత్తం చేశారు. 

దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, అక్బర్‌బాగ్, ఓల్డ్‌మలక్‌పేట్, మున్సిపల్‌ కాలనీ, పద్మనగర్, కాలడేర, మలక్‌పేట్‌ రైల్వే బ్రిడ్జి,  అజంపురా,   సైదాబాద్, సరూర్‌నగర్, ఆర్‌కేపురం, ఐఎస్‌సదన్‌  తదితర ప్రాంతాల్లోని లోతట్టు  కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  ఈ ప్రాంతాల్లోని నాలాలు పూర్తిగా పూడుకుపోయి  ము రుగునీరంతా రోడ్లపై కాలనీల్లో ప్రవహిస్తోంది. నాలాల్లోని  పూడికతీత పనులు ఎప్పటికప్పుడు చేపట్టకపోవడంతోనే వరద సరిగా ప్రవహించలేక కాలనీలు, బస్తీలను ముంచెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

పొంగుతున్న డ్రైనేజీలు 
మలక్‌పేట్, ఎన్‌టీఆర్‌నగర్, అల్కాపురి, భగత్‌సింగ్‌నగర్, ఓల్డ్‌మలక్‌పేట్, తీగలగూడ  తదితర కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై పారుతున్న మురుగుతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షానికి లోతట్టు కాలనీల ప్రజలు, మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ముంపు సమస్యతో భయందోళన చెందుతున్నారు. మలక్‌పేట్‌లోని మూసీ లోతట్టు కాలనీల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు పర్యటించి అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)