Breaking News

ఆపరేషన్‌ మోరంచపల్లి.. గ్రామస్తులు సేఫ్‌

Published on Thu, 07/27/2023 - 07:46

సాక్షి, భూపాలపల్లి: వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి గ్రామాస్థులు సురక్షితంగా బయటపడ్డారు. హెలికాఫ్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామంలోని ప్రజలందరినీ సేఫ్‌జోన్‌కు చేర్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా మోరంచపల్లి గ్రామస్తులు అంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

అంతకుముందు మోరాంచపల్లిలో రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఫైర్‌ సర్వీస్‌& డిజాస్టర్‌ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 70మందిని సేఫ్ చేశామని, దాదాపు గ్రామాన్ని కాళీ చేస్తున్నామని పేర్కొన్నారు.వరరంగల్ టౌన్‌లో సైతం బోట్స్ సహాయంతో లోతట్టు ప్రాంతాల్లో అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. మంథనిలో  ఇసుక క్వారి వద్ద తొమ్మిది మందిని కాపాడామని, ఇద్దరిని ఇంకా కాపాడే ప్రయత్నం సాగుతోందని తెలిపారు. 

ఎలికాఫ్టర్ సహాయంతో రెస్క్యూ ప్రయత్నం సాగుతుందన్నారు. కాటారం మండలం గంగారం  నలుగురిని కాపాడే రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుందన్నారు. ఎక్కడ ఇబ్బందిఉన్నా 100,101కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. సెల్ఫీలు, ఫొటోలు దిగడానికి ఎవరు కూడా బయటకు వెళ్లరాదని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకి రావద్దని, రేపు కూడా వర్ష ప్రభావం ఉన్న నేపథ్యంలోఅప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

కాగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుతున్నాయి.  కుండపోత కారణంగా మోరంచ వాగు ప్రవాహం ప్రమాదకర స్థాయి దాటి మోరంచపల్లి గ్రామాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. 

దీంతో కొందరు గ్రామస్తులు వర్షంలోనే బిల్డింగ్‌లపైకి ఎక్కి రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని గ్రామస్తులు వణికిపోతున్నారు.  వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. చాలామంది సెల్‌ఫోన్లు కూడా పని చేయడం లేదని.. దీంతో అధికారుల సాయం కోరేందుకు కూడా వీలుకావడం లేదని వాపోతున్నారు.   వందేళ్ల తర్వాత ఇలాంటి స్థాయిలో వరద ముంచెత్తినట్లు తెలుస్తోంది.

మోరంచపల్లి గ్రామంలో 300 మంది.. వెయ్యి జనాభా దాకా ఉంది. వానాకాలం వచ్చినప్పుడల్లా మోరంచవాగు ప్రవాహంతో గ్రామం చుట్టూ నీరు చేరుతుంటుంది. అయితే ఈ దఫా గ్రామాన్ని వాగు పూర్తిగా ముంచెత్తడం గమనార్హం. ఈ ప్రభావంతో భూపాలపల్లి-హన్మకొండ వైపు రహదారిపై ఆరు అడుగుల ఎత్తు నుంచి నీరు ప్రవహిస్తుండగా.. రాకపోకలు నిలిచిపోయాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)