Breaking News

మమ్మీ.. డాడీ.. ఒంటరి చేశారు

Published on Sun, 01/11/2026 - 13:19

పెద్దపల్లి జిల్లా: ‘మమ్మీ, డాడీ నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. మమ్మీ.. పరీక్షలు దగ్గరపడుతున్నాయి మంచిగా చదువుకో అన్నావు.. డాడీ.. ఎంత ఖర్చయినా నీకు ఇష్టమున్న కాలేజీలో చదివిస్తానన్నావు.. పొద్దున్నే స్కూల్‌ టైం అవుతుంది.. తొందరగా రెడీ అవ్వు అని అల్లారుముద్దుగా బడికి పంపిస్తిరి.. ఇప్పుడు నాకు దిక్కెవ్వరు.. మీ ప్రేమ ఎవరి నుంచి దొరుకుతుంది.. నేను ఎందుకోసం చదవాలి.. నా మంచిచెడు ఎవరితో చెప్పుకోవాలి’ అంటూ ఆ కూతురు రోదన వర్ణనాతీతం. 

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన కందుల తిరుపతి–స్రవంతి దంపతులు. అన్యోన్యంగా ఆర్థిక పొదుపు పాటిస్తూ ఆదర్శంగా జీవించారు. వీరి కూతురు శివాణి ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. మూడేళ్ల క్రితం మేడిపల్లి ఓపెన్‌కాస్టు మూతపడడంతో క్రమంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తిరుపతి ఏదో ఓ పని చేసుకుంటూ, స్రవంతి కుట్టుమిషన్‌తో ఎంతో కొంత సంపాదిస్తూ ఆనందంగా ఉన్నారు. ఈనెల 7న దంపతుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. క్షణికావేశంలో భార్య బాత్రూమ్‌లోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటిచుకోగా, భర్త మంటలు ఆర్పే ప్రయత్నంలో ఇద్దరూ 70శాతం కాలిపోయారు. స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ఈనెల 8న తిరుపతి, 10న స్రవంతి మృతిచెందారు.

చివరిచూపునకు నోచుకోక..
క్షణికావేశానికి తల్లిదండ్రులు బలి కాగా, కూతురు రోదనలు మిన్నంటాయి. ‘మమ్మీ.. డాడీ’ అని ఎవరిని పిలవాలంటూ శివాణి రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. తండ్రి చనిపోయిన విషయం తల్లికి తెలియదు.. తండ్రి అంత్యక్రియలు పూర్తవగానే తల్లి మరణం.. మళ్లీ తల్లికి అంత్యక్రియలు చేయడం.. మూడురోజులుగా ఆ కూతురు గుండెలవిసేల రోదించింది. పగోడికైనా ఇంతటి కష్టం రావద్దంటూ గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. తల్లి స్రవంతి శరీరం పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాన్ని ప్యాక్‌ చేసి పంపించగా, కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నానంటూ శివాణి వెక్కివెక్కి ఏడ్వడం గుండెలను పిండేసింది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)