Breaking News

తోపుడు బండిపై ఆస్పత్రికి మృతదేహం..

Published on Mon, 08/18/2025 - 07:28

నారాయణపేట జిల్లా: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ యువకుడి మృతదేహాన్ని పోలీసులు తోపుడు బండిపై పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రజలంతా చూ స్తుండగానే పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వ త్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఈ ఘటన జరిగింది. వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండల కేంద్రానికి చెందిన మొగులయ్య (28) భార్యాపిల్లలతో కలసి కోస్గి లోని అత్తగారింట్లో ఉంటూ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, ఆదివారం అతను ద్విచక్రవాహనంపై బస్టాండ్‌ వైపు వెళ్తుండగా టిప్పర్‌ ఢీకొట్టడంతో అక్కడికక్క డే మృతిచెందాడు. 

ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘట నా స్థలానికి చేరుకుని మొగులయ్య మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం అర కిలోమీటరు దూరంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తోపుడు బండిలో తరలించారు. సంతలో నిమ్మకాయలు విక్రయించేందుకు వచి్చన ఓ చిరువ్యాపారికి చెందిన తోపుడు బండిని అతని అను మ తి లేకుండానే తీసుకొని పోలీసులు మృతదేహాన్ని తరలించిన తీరును చూ సి అక్కడ గుమిగూడిన జనం అవాక్కయ్యారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడి యో తీసి ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో ఇదీ పరిస్థితి.. అంటూ వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేయడంతో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.

 ఈ ఘటనపై స్థానిక ఎస్‌ఐ బాలరాజును వివరణ కోరగా తాను సెలవులో ఉన్నానని చెప్పారు. ఎస్‌హెచ్‌ఓగా ఉన్న ఏఎస్‌ఐ ఆంజనేయులును వివరణ కోరగా మృతుని కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో తోపుడు బండిపై మృతదేహం తరలించామన్నారు. సమయానికి వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఇలా చేయాల్సి వచి్చందని చెప్పారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)