Breaking News

HCA Controversy: దేవరాజ్‌ తమిళనాడులో అరెస్టు

Published on Fri, 07/25/2025 - 19:16

హైదరాబాద్‌:  హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో అవినీతి ఆరోపణల కేసులో జనరల్‌ సెక్రటరీ దేవరాజ్‌ను ఎట్టకేలకు తెలంగాణ సీఐడీ అరెస్ట్‌ చేసింది. తమిళనాడులో దేవరాజ్‌ను సీఐడీ పోలీసులు పట్టుకున్నారు.  ఈ కేసులో ఏ-2గా ఉన్న దేవరాజ్‌.. 17రోజులుగా పరారీలో ఉన్నారు. సీఐడీ కేసు నమోదు చేసినప్పట్నుంచీ దేవరాజ్‌ పరారీలో ఉన్నారు. 

హెచ్‌సీఏ వివాదంలో  ప్రెసిడెంట్‌ జగన్మోహన్‌రావును ఈ నెల 9వ తేదీన తెలంగాణ సీఐడీ అరెస్ట్‌ చేసింది. జగన్మోహన్‌రావుతో పాటు పలువుర్ని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో జగన్మోహన్‌రావు ఏ-1గా ఉన్నారు.ఐపీఎల్‌ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్‌ సిఫార్సు మేరకు సీఐడీ దర్యాప్తు ేచేపట్టింది. దీనిలో భాగంగా ఏ-2గా ఉన్న జనరల్‌ సెక్రటరీ దేవరాజ్‌ను  పోలీసులు ఈరోజు(శుక్రవారం, జూలై 25) అరెస్ట్‌ చేయడంతో విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉంది.

గత ఐపీఎల్‌ సీజన్‌లో హెచ్‌సీఏ-ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య టికెట్ల వివాదం జరిగిన సంగతి తెలిసిందే. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ హోదాలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీని జగన్‌మోహన్‌రావు బెదిరించారన్నది ప్రధాన అభియోగం. అయితే ఆ అభియోగాలన్నీ వాస్తవమేనని విజిలెన్స్‌ నిర్ధారించడంతో సీఐడీ ఇప్పుడు అరెస్టులు చేసింది.

హెచ్‌సీఏకు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం 10 శాతం టికెట్లు ఉచితంగా ఇస్తోంది. అయితే మరో 20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్‌లు జరగబోనివ్వమని ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యాన్ని జగన్‌మోహన్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే హెచ్‌సీఏలో భారీ స్కామ్‌లు వెలుగుచూడటంతో అందులోని పెద్దల పాత్రపై దర్యాప్తు చేపట్టింది సీఐడీ. 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)