Breaking News

Telangana: మతిస్థిమితం లేని మహిళకు మరణశిక్షా?

Published on Sat, 01/24/2026 - 11:45

సాక్షి, హైదరాబాద్‌: మతిస్థిమితం లేని వ్యక్తికి చట్టప్రకారం మరణశిక్ష విధించడం సాధ్యంకాదని హైకోర్టు స్పష్టం చేసింది. తాను చేస్తున్నది తప్పు, చట్టవిరుద్ధమని గ్రహించలేని స్థితిలో చేసిన నేరానికి శిక్ష విధించలేమని అభిప్రాయపడింది. 2021లో తన సొంత బిడ్డను నరబలి ఇచ్చిన బానోత్‌ భారతికి సూర్యాపేట కోర్టు విధించిన మరణశిక్షను ఉన్నత న్యాయస్థానం శుక్రవారం రద్దు చేసింది. చిన్నారి మరణానికి దారితీసిన చర్య భౌతికంగా నిందితురాలి కారణంగానే జరిగినప్పటికీ ఘటన సమయంలో ఆమె తీవ్ర మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని హైకోర్టు పేర్కొంది. 

దీంతో ఆమెకు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 84 కింద రక్షణ వర్తిస్తుందని చెప్పింది. అప్పీలుదారురాలైన నిందితురాలే నేరానికి పాల్పడినప్పటికీ అది చట్టం దృష్టిలో నేరం కాదని.. నిర్దో షిగా విడుదల చేసేందుకు ఆమె అర్హురాలని తేలి్చచెప్పింది. సెషన్స్‌ కోర్టు గతేడాది ఏప్రిల్‌లో మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు చట్ట ప్రకారం చెల్లదంటూ రద్దు చేసింది. అప్పీల్‌ను అనుమతిస్తూ బాధితురాలిని చంచల్‌గూడ జైలు నుంచి ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని చంచల్‌గూడ జైలు సూపరింటిండెంట్‌ను ఆదేశించింది. 

గత ఏప్రిల్‌లో మరణశిక్ష..: సూర్యాపేట జిల్లా మోతే మండలం మేకలపాటి తండాలో 2021 ఏప్రిల్‌ 15న భారతి అనే మహిళ తన ఇంట్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఏడు నెలల తన కన్నబిడ్డ గొంతు, నాలుక కోసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో బిడ్డ మృతిచెందింది. దేవుళ్లకు నరబలి ఇచ్చి తన సర్పదోషాన్ని పోగొట్టుకున్నట్లు భారతి కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ కేసులో భారతిని అరెస్టు చేసిన పోలీసులు సూర్యాపేట కోర్టులో హాజరుపరచగా వాదనల అనంతరం గతేడాది ఏప్రిల్‌లో కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును ఆమె హైకోర్టులో సవాల్‌ చేసింది. 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు