నిన్న ప్రియురాలు.. నేడు ప్రియుడు!

Published on Wed, 01/07/2026 - 15:15

సాక్షి, హైదరాబాద్: ప్రేమ వ్యవహారం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. ఒకరికొకరు దూరం అవుతున్నారనే బాధలో.. బలవన్మరణానికి పాల్పడి తమ కుటుంబాల్లో విషాదం నింపారు. యాచారం మండలం మేడిపల్లి గ్రామ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. 

హయత్‌ నగర్‌ పీఎస్‌ పరిధి బ్రహ్మణపల్లిలో బుధవారం ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఓ వెంచర్‌లోకి వెళ్లి పెట్రోల్‌ పోసుకుని తగలబెట్టుకున్నాడు. అది గమనించిన కొందరు స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడ్ని మేడిపల్లి గ్రామానికి చెందిన మహేష్‌గా గుర్తించారు. అయితే కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయం ఒకటి తెలిసింది. 

మేడిపల్లి గ్రామానికే చెందిన పూజ(17) నిన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహేష్‌-పూజలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలి మృతిని తట్టుకోలేకనే మహేష్‌ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే.. 

ఈ ఇద్దరూ గతంలోనూ సూసైడ్‌ అటెంప్ట్‌ చేసినట్ల తేలింది. రెండు నెలల కిందట ఇద్దరూ పురుగుల మందు తాగగా.. స్థానికులు గుర్తించి రక్షించారు. ఆ తర్వాత ఏమైందో తెలీయదుగానీ.. వెనువెంటనే ఇలా ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)