Breaking News

త్వరలో పేదలకు ఎయిర్‌ అంబులెన్స్‌లు 

Published on Tue, 09/26/2023 - 04:44

సాక్షి, హైదరాబాద్‌/ గన్‌ఫౌండ్రి: రాష్ట్రంలో త్వరలో ఎయిర్‌ అంబులెన్సులు ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ఏ మూలన అత్యవసర పరిస్థితి ఏర్పడినా రోగులను హెలికాప్టర్‌ ద్వారా దవాఖానాకు తరలిస్తామన్నారు. కోటీశ్వరులకే పరిమితమైన ఈ సేవలను పేదలకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. సోమవారం రవీంద్రభారతిలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పదేళ్ల ప్రగతి నివేదికను ఆయన  విడుదల చేశారు. అలాగే 310 మంది ఫార్మసిస్టులకు పోస్టింగ్‌ ఆర్డర్లు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత తొమ్మిదేళ్లలో వైద్య ఆరోగ్యశాఖలో 22,600 పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. మరో 7,291 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇందులో 5,204 స్టాఫ్‌ నర్సుల పోస్టులకు పరీక్ష పూర్తయిందని, వారం పది రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. మరో 156 ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్లు, 1,931 ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్‌ (దరఖాస్తు దశ) పోస్టులు కూడా ఉన్నాయని వివరించారు. ఇవి కూడా పూర్తయితే పదేళ్లలోనే 30 వేల ఉద్యోగాలు వైద్య ఆరోగ్యశాఖలో ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. 

దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ 
 పదేళ్ల ప్రయాణంలో ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. అరవై ఏళ్లలో సాధ్యం కాని అద్భుతాలను దశాబ్ద కాలంలోనే ఆవిష్కరించిందన్నారు. 2014లో నీతి ఆయోగ్‌ ఆరోగ్య సూచీలో 11 వ స్థానంలో ఉంటే, ఇప్పుడు మూడో ర్యాంకుకు చేరుకున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైద్య రంగానికి రూ.12,364 కోట్ల బడ్జెట్‌ పెట్టామని, ఒక్కొక్కరి వైద్యానికి చేస్తున్న తలసరి ఖర్చు రూ.3,532 అని తెలిపారు.

తద్వారా దేశంలో మూడో స్థానంలో నిలిచామని చెప్పారు. తెలంగాణ వైద్య ఆరోగ్య రంగం మొత్తం 50 వేల పడకలతో కరోనా కాదు దాని తాత వచ్చినా ఎదుర్కొనేలా సిద్ధమైందని మంత్రి పేర్కొన్నారు. గాంధీ ఆసుపత్రిలో అవయవ మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో దేశ విదేశాల నుంచి వచ్చి అవయవ మార్పిడులు చేసుకునేలా ప్రభుత్వ ఆస్పత్రులు మారబోతున్నాయని చెప్పారు.

ఎంఎన్‌ జే క్యాన్సర్‌ హాస్పిటల్‌లో ప్రతినెల సగటున 8 మందికి బోన్‌ మారో ట్రాన్స్‌ప్లాంట్‌ ఉచితంగా చేస్తున్నారని తెలిపారు. ఔషధాల అందుబాటు, పంపిణీ ప్రక్రియలో తెలంగాణ త్వరలో రెండో స్థానానికి చేరనున్నట్టు హరీశ్‌రావు వివరించారు. ఔషధాలను సమకూర్చడం, రోగులకు అందించడంలో ఫార్మాసిస్టులది కీలక పాత్ర అంటూ కొత్త ఫార్మాసిస్టులకు ఆయన స్వాగతం పలికారు.    

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)