Breaking News

నిజామాబాద్‌ ఆసుపత్రిలో దారుణం.. హరీష్‌ రావు సీరియస్‌

Published on Sat, 04/15/2023 - 15:32

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రోగిని స్ట్రెచర్‌లో వార్డుకు తరలించేందుకు సిబ్బంది ఎవరూ లేక పోవడంతో బంధువులే కాళ్లు పట్టుకుని ఈడ్చుకు వెళ్లిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని డీఎంఈ రమేశ్‌రెడ్డిని ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణకు రూ.లక్షల్లో వెచ్చిస్తున్నప్పటికీ రోగులకు స్ట్రెచర్లు, వీల్‌చైర్లు అందుబాటులో ఉంచకపోవడంపై మంత్రి సీరియస్‌ అయినట్లు తెలిసింది.

జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు సైతం ఆస్పత్రి సిబ్బందిపై తీవ్రంగా సీరియస్‌ అయ్యారు. స్ట్రెచర్‌ లేకుండా రోగిని బంధువులే కాళ్లు పట్టు కుని లిఫ్ట్‌ వరకు ఈడ్చుకెళ్లిన వీడియో ఫుటేజీని పరిశీలించా రు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ను ఆదేశించారు. కాగా, ఈ ఘటనపై డాక్టర్‌ ప్రతిమారాజ్‌ మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రిలో స్ట్రెచర్లు, వీల్‌చైర్ల కొరత లేదన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి 10 సెకండ్ల పాటు వీడియో తీసి 15 రోజుల తర్వాత వైరల్‌ చేయటం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తనకు తెలియదన్నారు.

ఈనెల 1న ఆస్పత్రికి వచి్చన రోగి బోధన్‌ మండలం అచన్‌పల్లి గ్రామానికి చెందిన హన్మాండ్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. అయితే.. సూపరింటెండెంట్‌ తన తప్పును సరిదిద్దుకోకుండా కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు దేగాం యదాగౌడ్‌ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్‌ చాంబర్‌ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు.  

మారని తీరు.. 
కాగా, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిపై ఎన్ని ఆరోపణలు వచి్చనా సిబ్బంది తీరు మారడం లేదు. స్ట్రెచర్, వీల్‌ చైర్లపై రోగులను తరలించాల్సి ఉండగా వాటర్‌ బాటిళ్లు, వాటర్‌ క్యాన్‌లు, బెడ్‌ షీట్‌లు తరలిస్తున్న దృశ్యం శనివారం ఆస్పత్రికి వెళ్లిన ‘సాక్షి’ కి కనిపించింది. రోగులను వార్డులోని డాక్టర్ల వద్దకు తుప్పు పట్టిన వీల్‌ చైర్లపై బంధువులే తోసుకుంటూ వెళ్తున్న దృశ్యం కంటపడింది.   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)