Breaking News

నివేదికే ఇవ్వలేదు.. అనుమతులెలా?

Published on Thu, 01/29/2026 - 04:37

సాక్షి హైదరాబాద్‌:  రాష్ట్రంలో మైక్రో బ్రూవరీల ఏర్పాటు విషయంలో అవినీతి జరుగుతోందని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు చేసిన ఆరోపణలను రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కొత్త బ్రూవరీల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆయా సంస్థలకు ఉన్న భూ లభ్యత, మౌలిక వసతులపై అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే అప్పుడు వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. 

అసలు ఆ నివేదికలే రానప్పుడు అనుమతులు ఎక్కడివని, అందులో అవినీతి ఎక్కడిదని ప్రశ్నించారు. బుధవారం రాత్రి రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జూపల్లి మాట్లాడారు.  

కాంగ్రెస్‌ కొత్త చట్టం ఏమీ తేలేదు.. 
‘మైక్రో బ్రుూవరీలకు సంబంధించి 2015 ఆగస్టు 28న జీవో నంబర్‌ 151 జారీ చేస్తూ నిబంధనలు రూపొందించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో బ్రూవరీలకు సంబంధించి కొత్త చట్టం ఏమీ తేలేదు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఉన్న నిబంధనలే ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈ జీవో ప్రకారమే 2016 జూలై 1న 20 బ్రూవరీలకు అనుమతి ఇచ్చారు. అప్పటినుంచి ఇప్పటివరకు మైక్రో బ్రూవరీలకు అనుమతుల కోసం నా వద్దకు ఎలాంటి ఫైళ్లు రాలేదు. సంబంధిత శాఖకు దరఖాస్తులు మాత్రమే  వచ్చాయి. 

అప్పుడు 50 దరఖాస్తులు వస్తే 20కి మాత్రమే అనుమతులు ఇచ్చారు. వాటికి లాటరీ పద్ధతి పాటించారా? గతంలో 105 ఎలైట్‌ బార్లకు అనుమతి ఇచ్చారు. 2016 – 2023 మధ్య ఈ ఎలైట్‌ బార్లకు కూడా లాటరీ ద్వారా కాకుండా నచి్చన వారికి అనుమతులు ఇచ్చింది వాస్తవం కాదా? వాస్తవాలు ఇలా ఉంటే అవగాహన రాహిత్యంతో హరీశ్‌రావు మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పులన్నీ వాళ్లు చేసి మాపై బురదజల్లుతున్నారు. దొంగే దొంగ అని అరిచినట్టుగా హరీశ్‌రావు తీరు ఉంది..’ అని జూపల్లి మండిపడ్డారు.  

ఎక్సైజ్‌ ఆదాయం పెంచుకున్నారు.. 
‘బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చే నాటికి ఎక్సైజ్‌ వార్షిక ఆదాయం రూ.10,012 కోట్లు మాత్రమే ఉంటే, 2014 –2023 వరకు తొమ్మిదేళ్లలో దాన్ని రూ.34,869 కోట్లకు పెంచారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 2024–25లో ఎక్సైజ్‌ ఆదాయం రూ.34,603 కోట్లు మాత్రమే వచ్చింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కంటే మా ప్రభుత్వంలో సుమారు రూ.250 కోట్ల ఆదాయం తగ్గింది. 

తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చింది ఎవరో ఈ లెక్కను బట్టి చెప్పాలి..’ అని జూపల్లి అన్నారు. ’వాటాలు పంపిణీ చేసుకుంది మీరు.  కాసులకు కోసం కక్కుర్తి పడింది మీరు. మీ బాగోతం, వాటాలపై చర్చకు సిద్ధమా?..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికలు సమీస్తుండటంతో రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)