Breaking News

ఒక్కోసారి ఒక్కో లెక్క!

Published on Sun, 11/30/2025 - 05:37

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ శాఖ మంత్రిగా రెండేళ్లుగా పనిచేస్తున్నా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆయన శాఖ లోని అంశాలపై అవగాహన లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తాను నిర్వహిస్తున్న శాఖలోని అంశాలపై ఒక్కోసారి ఒక్కో లెక్కను చెప్తున్న భట్టి.. ‘ఇతరులు రాజకీయాలకు పనికి రారు’అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శించారు. ప్రభుత్వానికి కమీషన్లపై ఉన్న శ్రద్ధ పాలసీలపై ఉండకపోవడం వల్లే అనేక పొరపాట్లు జరుగుతున్నాయన్నారు. బాధ్యతా యుతమైన పదవుల్లో ఉంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడాన్ని మానుకోవాలని, ప్రతిపక్ష నాయకులపై దురుసుగా మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు. విద్యు త్‌ శాఖపై శనివారం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ సందర్భంగా భట్టి చేసిన వ్యాఖ్యలను హరీశ్‌రావు ఖండించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.  

ఇన్‌స్టాల్డ్‌ కెపాసిటీ ఎక్కడైనా తగ్గుతుందా? 
‘అసెంబ్లీ సాక్షిగా విద్యుత్‌పై విడుదల చేసిన శ్వేతపత్రం, ఇటీవల విడుదల చేసిన క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ గణాంకాలు పొంతన లేకుండా ఉన్నాయి. పీపీటీలో చెప్పిన గణాంకాలు తప్పుల తడకగా ఉన్నాయి. సోలార్‌ విద్యుత్‌ స్థాపిత సామర్ధ్యం 2023లో 6,123 మెగావాట్లుగా శ్వేతపత్రంలో చెప్తూ, పీపీటీలో మాత్రం 2025 నాటికి 5,415 మెగావాట్లుగా పేర్కొన్నారు. ఇన్‌స్టాల్డ్‌ కెపాసిటీ ఎక్కడైనా తగ్గుతుందా? శ్వేతపత్రం, పాలసీలోని గణాంకాలను పోల్చి చూసుకున్నారా లేదా? క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ పేజీ నం.8లో ప్రస్తుత కాంట్రాక్టెడ్‌ కెపాసిటీ 26,212 మెగావాట్లుగా చె ప్తూ పేజీ నంబరు 10లో 2029–30 నాటికి 49,104 మెగావాట్లకు చేరుతుందని పేర్కొన్నారు. అంటే 2029–30 నాటికి 1,729 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ఉత్పత్తి మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇటీవలి కేబినెట్‌ నోట్‌ ప్రకారం 2,400 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీని తుంగలో తొక్కుతున్నారు..’అని హరీశ్‌ ఫైర్‌ అయ్యారు.

ఆగమేఘాల మీద థర్మల్‌ ప్లాంట్లు ఎందుకు? 
‘గ్రీన్‌ ఎనర్జీ పాలసీ–2025 ప్రకారం 2030 నాటికి 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన (రెన్యువబుల్‌ ఎనర్జీ) ఉత్పత్తిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రాబోయే ఐదేళ్లలో సుమారు 13 వేల మెగావాట్ల సోలార్‌ ఎనర్జీ సాధించాల్సి ఉండగా థర్మల్‌ ప్లాంట్లపై ఆగమేఘాల మీద కేబినెట్‌ ఎందుకు నిర్ణయం తీసుకుందో చెప్పాలి? మొత్తం 2,400 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం కోసం చేసే రూ.50 వేల కోట్ల ఖర్చులో 30 నుంచి 40 శాతం కమీషన్‌ పొందడమే ప్రభుత్వ పెద్దల ఉద్దేశంగా కనిపిస్తోంది.

మంత్రి శ్రీధర్‌బాబు కూడా అధికారులు రాసి ఇచి్చన వివరాలను గుడ్డిగా చదువుతున్నారు. మక్తల్‌లో 800 మెగావాట్ల థర్మల్‌ ప్లాంటు ఏర్పాటుపై మాట మార్చి అబద్ధాలు చెప్తున్నారు. రామగుండం పవర్‌ ప్లాంటులో ఒక్కో మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి రూ.14 కోట్లు ఖర్చు అవుతుందని కేబినెట్‌లో చెప్పి, ఇప్పుడు ఇంకా డీపీఆర్‌ కాలేదని బుకాయిస్తున్నారు. మహిళా సంఘాలకు వేయి మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్లు అప్పగిస్తామనే ప్రకటనలపై స్పష్టత ఇవ్వకుండా విపక్షాల మీద మంత్రులు బురద చల్లుతున్నారు..’అని మాజీమంత్రి విమర్శించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)